28.7 C
Hyderabad
April 25, 2024 04: 46 AM
Slider వరంగల్

చెప్పకుండా మర్కజ్ వెళ్లివచ్చి గోప్యంగా ఉద్యోగంలో చేరి…

janagam CI

ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు ఎటువంటి సమాచారం లేకుండా వెళ్ళి రావడమే కాకుండా వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా విధులకు హాజరై కరోనా వ్యాప్తికి కారణమైన జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో అడ్మిన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఎండి ఖాజా మొహినొద్దీన్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేష్ తెలిపారు.

సిఐ మాట్లాడుతూ డీఆర్డీవో రాంరెడ్డి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 269, 270( ఇతరులకు ప్రాణ హాని తలపెట్టే విధంగా చేయడం, వైరస్ వ్యాప్తి చెందే విధంగా ప్రయత్నం చేయడం), సెక్షన్ 188( ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం) పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఢిల్లీ  నుంచి వచ్చిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం గమనించి కూడా యధావిధిగా విధులకు హాజరైనట్లు స్పష్టం చేశారు. ఈ నెల 21, 23, 27 తేదీల్లో విధుల కు హాజరై అధికారులు, సిబ్బందితో సన్నిహితంగా మెదిలి తన నిర్లక్ష్యాన్ని నిరూపించుకున్నట్లు తెలిపారు.

విధుల పట్ల నిర్లక్ష్యం తో పాటు సమాచారం లేకుండా ఢిల్లీకి వెళ్లి మత ప్రార్థనల్లో పాల్గొని వైరస్ ను ఇక్కడ వ్యాప్తి చెందేందుకు ప్రయత్నించిన ఖాజా మొహిదీన్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Related posts

పల్లెల్లో కూడా ‘దిశ’ యాప్ వినియోగంపై పోలీసు శాఖ విస్తృత ప్రచారం

Satyam NEWS

ధర్డ్ వికెట్: యనమల రామకృష్ణుడిపై ఎస్ సి ఎట్రాసిటీ కేసు

Satyam NEWS

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం

Satyam NEWS

Leave a Comment