27.7 C
Hyderabad
April 20, 2024 01: 00 AM
Slider రంగారెడ్డి

వరసకు కూతురు… అయితేనేం వాడు కామాంధుడు

#SexualHarassment

వరసకు కూతురు అయితేనేం తన కామ దృష్టి మారదు అంటూ ఒకడు ప్రవర్తించాడు. దారుణమైన ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని నేరేడు మెట్ లో జరిగింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన జయరాం భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోయాడు. ఆ తర్వాత మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నాటికే ఆమెకు ఒక కుమార్తె ఉంది.

18 ఏళ్ల ఆ అమ్మాయిపై జయరాం కన్నేశాడు. తండ్రి స్థానంలో ఉన్న అతను ఆ విధంగా ప్రవర్తించడంతో బాధ కలిగి భార్య తన బంధువులకు విషయం చెప్పింది.

దాంతో వారు ఆ అమ్మాయిని తమ ఇంటికి తరలించారు. అక్కడే ఆ అమ్మాయి ఉంటున్నది. ఇది నచ్చని జయరాం కూతుర్ని ఇంటికి తీసుకురావాలని భార్యపై తీవ్రంగా వత్తిడి తెస్తున్నాడు.

దాంతో ఏం చేయాలో అర్ధం కాని భార్య నేరేడ్ మెట్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అమర్ నాథ్ అపశృతిపై అక్షయ్ కుమార్ సంతాపం

Satyam NEWS

అమ్మ

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే నేనే ధర్నాకు దిగుతా

Satyam NEWS

Leave a Comment