39.2 C
Hyderabad
March 28, 2024 16: 37 PM
Slider ముఖ్యంశాలు

కామెడీ పేరుతో బ్రాహ్మణులపై వెకిలి డైలాగులు

julakataka

బ్రాహ్మణులను కించపరిచే విధంగా డైలాగులతో దారుణమైన వ్యాఖ్యానాలతో జెమినీ టీవీలో ప్రసారమైన జూలకటక అనే కామెడీ షోపై ఫిర్యాదు నమోదు అయింది. వెంకట రమణ శర్మ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కామెడీ షో పై కేసు నమోదు చేశారు.

బ్రాహ్మణులను కుక్కలతో పోల్చిన ఆ కామెడీ షోలో ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని వెంకట రమణ శర్మ ఫిర్యాదు చేశారు. ఈ కామెడీ షో జెమినీ టీవీ లో ప్రసారం అయింది. బ్రాహ్మణులను కించపరచిన ఈ క్లిప్పింగ్ లో యాంకర్ శ్రీముఖి, యాంకర్ ఉదయభాను, బిత్తరి సత్తి కనిపిస్తారు.

బ్రాహ్మణులను కించ పరచే ఈ జూలకటక కామెడీ షోలోని ఈ ఎపిసోడ్ ను కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇటీవలె పదవీ విరమణ చేసిన ఐ ఏ ఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఆక్షేపిస్తూ జెమినీ ఛానెల్ కు లేఖ రాశారు. బ్రాహ్మణులను కించ పరిచేవిధంగా ఉన్న ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడంపై ఎల్ వి సుబ్రహ్మణ్యం ఛానెల్ నిర్వాహకులను ప్రశ్నించారు.

దానికి జెమిని ఛానెల్ వారు ఒక వివరణ పంపారు. ఈ కార్యక్రమం 2017లో తమ ఛానెల్ లో ప్రసారం అయిందని అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని యూట్యూబ్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని కొందరు ప్రచారం చేసి ఉంటారని జెమినీ ఛానెల్ హెడ్ కిరణ్ వివరించారు. ఈ క్లిప్పింగ్ ను తీసేయాల్సిందిగా యూట్యూబ్ ను కోరుతున్నామని ఆయన చెప్పారు.  ఏది ఏమైనా బ్రాహ్మణులు కించపరిచే విధంగా డైలాగులు రాసి వారిని, అందులో నటించిన వారిని, దానికి యాంకరింగ్ చేసిన వారిని, ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన వారిని తగిన విధంగా శిక్షించాలని బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి.

Related posts

కీలక మావోయిస్టు నాయకుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

Satyam NEWS

మహేష్ బాబు పుట్టిన రోజుకు గిన్నీస్ కానుక

Satyam NEWS

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి

Satyam NEWS

Leave a Comment