భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒక మహిళపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పతింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మహిళా భర్తను బెదిరించి ఒక మహిళను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే భర్త కేకలు వేయడంతో వారు పరారయ్యారు.
అప్పటికే బాధితురాలు 100 నెంబర్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి పాల్వంచకు చేరుకున్న దంపతులు బస్టాండ్ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.