27.7 C
Hyderabad
April 26, 2024 03: 36 AM
Slider విజయనగరం

ఆరుగురు ఆడ‌పిల్ల‌లు…అంగవైకల్యంతో ఉన్న తండ్రి…..

#OperationMuskan

ఉరుకులు,ప‌రుగులు తీసే ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఎవ‌డి బ‌తుకు వాడిది..ఎవ‌డి వృత్తి  వాడిది..ఎవ‌రి కుటుంబం వారిది. క‌ష్టే ఫ‌లే సుఖీ ఈ నినాదంతో ప‌ని చేస్తేనే చేతిలో న‌లుగు రాళ్లు అదేనండీ డబ్బులు వ‌స్తే దాంతోనే బ‌త‌క‌డం..జీవించ‌డం… ఉన్నంత‌లో స‌ర్దుకోవాల‌ని అంద‌రూ చెబుతున్న మాట‌లే.

కాని దిగితే కాని ఏ ఒక్క‌రికీ లోతు తెలియ‌ద‌న్న‌ట్టు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. పొరుగునే ఉన్న విజ‌య‌నగ‌రం జిల్లా ఎస్.కోట‌కు వ‌చ్చింది. పెళ్లి చేసుకున్నాడు… వ‌రుస‌గా ఆడ‌పిల్ల‌లు..మ‌గ‌పిల్లాడు పుట్ట‌క‌పోతాడా….? మ‌మ్మ‌ల్ని పోషించ‌క‌పోతాడా..? అంటూ ఆ వికలాంగ తండ్రి  ఆరుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చాడు.

అందులోనూ  కాళ్లు రెండూ లేక, వెన్ను పూస కూడా స‌రిగ్గా లేని ఆ తండ్రి మాత్రం త‌న‌ కోరిక‌ల‌ను చంపుకోలేక‌పోయాడు. కాని అంత‌లోనే పుట్టిన ఆడ‌పిల్ల‌లంతా పెరిగి పెద్ద‌వుతున్నారు. బ‌తుకు భార‌వుతోంది..క‌నీసం కాయ కష్టం చేద్దామ‌నుకున్నా…అవిటి వాడు. అటు పిల్ల‌ల‌ను చదివించ లేక‌..చిన్నారుల‌ను ఇష్ట‌మైన‌ది పెట్టలేక..కుటుంబాన్ని న‌డ‌ప‌లేని దుస్థితిలో ఇక లాభం లేద‌నుకుని తాళి  క‌ట్టిన భార్య‌తో స‌హా అంద‌రిన్నీ ప‌నుల్లోకి పంపించాడు.

వాళ్లు తెచ్చిన కూలీ డ‌బ్బుల‌తో పూట గ‌డ‌చేది. సీన్ క‌ట్ చేస్తే పోలీస్ శాఖ ప్రారంభించిన ఆప‌రేష‌న్ ముస్కాన్ ప‌థ‌కం…ఆ ఆడ‌పిల్ల‌లకు వ‌రంలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తీ జిల్లాలో మాదిరిగానే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎస్పీ రాజ‌కుమారీ ఎంతో వ్యూహాత్మ‌కంగా ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఎస్పీ ఆదేశాల‌తో విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ  అనిల్…ఎస్.కోట‌లో ప‌ని చేస్తున్న ఓ బాలిక‌ను గుర్తిస్తే…మిగిలిన అయిదుగురు ఆడ‌పిల్ల‌లతో పాటు త‌ల్లి ప‌నిలోకి వెళ్ల‌డాన్ని తెలుసుకున్నారు. చిన్నారుల‌చే క‌న్న తండ్రి ప‌నులు ఎందుకు చేయిస్తున్నాడ‌ని ఇంకా లోతుగా పోలీసులు ఆరా తీస్తే..తండ్రి అవిటి త‌నం వెలుగులోకి వ‌చ్చింది.

ఇక అంత‌మంది ఆడిప‌ల్ల‌ల‌ను ఎందుకు క‌న్నాడు అని  పోలీసులు మ‌రింత లోతుగా క‌నుక్కుంటే వంశాకురం కోసం..మగ పిల్లాడు కోసం క‌న్న‌వాళ్లు ప‌డుతున్న ఆరాటం అని తెలిసి ఖాకీలైన పోలీసులే షాక్ తిన్నారు.

త‌క్ష‌ణం..ఆ బాలిక‌ల‌కు ఏదో మార్గం చూపాల‌ని అలాగే అవిటి తండ్రికి ఉపాధితో పాటు ట్రై  సైకిల్ ఇప్పించాల‌ని ముందుకు వ‌చ్చారు…ఎస్పీ రాజ‌కుమారి. వెనువెంటే ఆప‌రేష‌న్ ముస్కాన్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి…దాదాపు 91 మందిపిల్ల‌ల‌ను స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ద్వారా గుర్తించి వారి సంర‌క్ష‌ణ చూడాల‌ని పేర్కొన్నారు.

ఆ స‌మ‌యంలోనే జిల్లాలో ఎస్.కోట లో అవిటి తండ్రి,,..ఆరుగురు ఆడ‌పిల్ల‌ల వ్య‌థ‌ను తెలుసుకున్న ఎస్పీ. తాను ఓ సాటి ఆడ మ‌నిషిగా చ‌లించిపోయారు.

చిన్నారుల‌ను చూసి మ‌న‌స్సు క‌రిగిపోయింది….త‌క్ష‌ణం  చేత‌నంత సాయం చేసారు. ప్రార్ధించే పెదువుల‌క‌న్నా సాయం చేసే చేతులే మిన్న అన్న విదంగా ఆ ఆరుగురు ఆడ‌పిల్ల‌ల‌కు బ‌ట్ట‌ల‌తో పాటు బిస్కెట్లు,చాక్లెట్లు చేతిలో పెట్టారు. త‌ద్వారా పోలీసుల‌కు మ‌న‌సు…మ‌మ‌త‌లుంటాయ‌ని చేత‌ల‌లో చేసి చూపించారు…ఎస్పీ  రాజ‌కుమారీ,డీఎస్పీ అనిల్.

హేట్సాప్ …!

Related posts

రేపటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు

Satyam NEWS

మూడవ వసంతంలోకి అడుగుపెట్టిన హోమ్ టుడే ఫర్నిచర్

Satyam NEWS

కరోనా విధి నిర్వహణ లో సిఐ కాలు ఫ్రాక్చర్

Satyam NEWS

Leave a Comment