39.2 C
Hyderabad
April 18, 2024 15: 41 PM
Slider కరీంనగర్

బండి పాదయాత్రపై పోలీసు ఉక్కుపాదం: ఉద్రిక్తత

#bandisainjai

తాను ఐదో విడత పాద యాత్ర కు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత చివరి క్షణంలో అనుమతి లేదని చెప్పడంలో అర్ధం ఏమిటి  అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించారు. .మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ వస్తున్నారని సమాచారం పోలీసులకు పంపామని… దగ్గరుండి సభ ఏర్పాట్లు పర్యవేక్షించి యూటర్న్ తీసుకుంటారా? అని అన్నారు. రూట్ మ్యాప్ కూడా ప్రకటించి…. బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాక హఠాత్తుగా అనుమతి లేదంటారా?అని నిలదీశారు..బండి సంజయ్.

బైంసా సున్నిత ప్రాంతం అంటున్నారు. అదేమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు పోవద్దు అని నిలదీశారు. బైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు అని బండి ప్రశ్నించారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలన్నారు…కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఎం కావాలి?అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర కు వెళుతుంటే అడ్డుకుంటారా ? – బండి సంజయ్ ప్రశ్నించారు.

రేపు బహిరంగ సభకు వెళ్లి తీరుతా….  పాదయాత్ర చేస్తానని ధీమా వ్యక్తం చేస్తూ హెచ్చరించారు.రేపు మధ్యాహ్నం వరకు మాకు సమయం ఉందని…. అప్పటివరకు నిరీక్షిస్తామని బండి సంజయ్ అన్నారు. న్యాయస్థానం తలుపు తడతాం అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఎం కావాలి? అని అన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర కు వెళుతుంటే అడ్డుకుంటారా ? అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. భారీ ఎత్తున తరలివస్తున్న బీజేపీ కార్యకర్తలు. అడుగడునా బండి సంజయ్ కు మద్దతు తెలుపుతూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు…పార్టీ కార్యకర్తలు.పాదయాత్ర కు, బహిరంగ స భకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతి రద్దు చేయడంపై కార్యకర్తల్లో ప ఆగ్రహం పెళ్లుబికింది. దీనిపై బండి సంజయ్ స్పందించారు.సిగ్గులేని సీఎం శాంతి భద్రత లకు విఘాతం కలిగించడం దారుణమంటూ మండిపడుతున్నారు కార్యకర్తలు.  నిర్మల్ లో బీజేపీ కార్యకర్తలను పోలీసులు కొట్టుకుంటూ అరెస్ట్ చేస్తున్నారన్నారు.

ఎస్పీని కలవడానికి వెళుతున్నా అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. భేషరతుగా కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీరు రెచ్చకోట్టినా మేం సoయంనంతో ఉన్నాం. మా సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దని హెచ్చరించారు.బండి సంజయ్ వాహనానికి రక్షణగా ఎక్కడికక్కడ రోడ్డుపై బైఠాయించారు పార్టీ కార్యకర్తలు. ముథోల్ లో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసారు పోలీసులు.కేసీఆర్ సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తల నిరసన తెలియజేసింది. పాదయాత్ర కు, బహిరంగ సభకు అనుమతి ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు బీజేపీ యువమోర్చా నాయకులు.

Related posts

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ఎదుట ధర్నా

Satyam NEWS

A.P ఉద్యోగస్తులకు “నవరత్న ఆయిల్” బహుకరణ!

Satyam NEWS

పాలేరుకు బస్టాండ్… కాంగ్రెస్ తోనే సాధ్యం

Satyam NEWS

Leave a Comment