28.7 C
Hyderabad
April 20, 2024 08: 33 AM
Slider విశాఖపట్నం

రెడ్ లైన్: చంద్రబాబు విశాఖ పర్యటనపై పోలీసుల ఆంక్షలు

vizag cbn tour

మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడి పర్యటనకు పోలీసులు అడ్డుతగిలారు. ఆయన ర్యాలీ చేసేందుకు అనుమతించలేదు. కావాలంటే ఆయన అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రోడ్డు మార్గంలో వెళ్లవచ్చునని చెప్పారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా తాము అనుకున్న కార్యక్రమం చేస్తామని శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు తెలిపారు.

విశాఖ పట్టణాన్ని అభివృద్ధి పరచి ఆర్ధిక రాజధానిగా చేసిన చంద్రబాబునాయుడంటే భయం కాబట్టే వైసిపి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని వారు అన్నారు. ఇదేం పోలీసు రాజ్యం అని వారు ప్రశ్నించారు. విశాఖ పట్టణాన్ని ఆర్ధిక రాజధానిగా చంద్రబాబునాయుడు ఏ నాడో ప్రకటించారని, అందుకు అనుగుణంగా విశాఖను ఆయన అభివృద్ధి చేసేశారని ఇప్పుడు వచ్చిన వైసిపి ప్రభుత్వానికి చంద్రబాబునాయుడిని అడ్డుకునే అర్హత లేదని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, నియంతలా ప్రవర్తించడం ముఖ్యమంత్రికి అలవాటైపోయిందని వారు అన్నారు. విశాఖను చంద్రబాబు అభివృద్ధి పరిచారు కాబట్టే ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించారని వారు తెలిపారు. విశాఖ పట్నాన్ని నాశనం చేసేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తున్నదని వారు తెలిపారు. విశాఖ పట్నంలో ప్రజలు ఎంతో శాంతి యుతంగా ఉంటారని అలాంటి వాతావరణాన్ని చెడగొట్టేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వారు తెలిపారు

Related posts

దాండియా కళాకారులకు నిత్యవసర వస్తువులు

Satyam NEWS

మనల్ని మనం రక్షించుకోవడానికి వాక్సినేషన్ ఒక్కటే తరుణోపాయం

Satyam NEWS

కరోనా కాలంలో ఇంత తక్కువ కూలి ఇస్తే ఎలా?

Satyam NEWS

Leave a Comment