31.2 C
Hyderabad
April 19, 2024 04: 57 AM
Slider ప్రత్యేకం

క‌రోనా ఎఫెక్ట్: పైడితల్లి అమ్మ‌వారి పండుగ‌పై పోలీసు శాఖ ఆంక్ష‌లు….!

#deepikapatil

స‌త్యం న్యూస్. నెట్ తో విజ‌య‌నగరం ఎస్పీ దీపికా ప్ర‌త్యేక ఇంట‌ర్య్యూ

మీరు విజ‌య‌న‌గ‌రం పైడితల్లి అమ్మ‌వారి  భ‌క్తులా…? ఏటా న‌గ‌రంలో జ‌రిగే పైడిత‌ల్లి అమ్మ‌వారి పండుగ‌కు వ‌స్తున్నారా..?   విజ‌య‌న‌గ‌రం ఇల‌వేల్సుల‌ను క‌ళ్లారా…క‌న్నులారా ద‌ర్శించుకోవాల‌నుకుంటున్నారా..? అయితే  మీ ఆశ‌లను వ‌ద‌లు కోవ‌ల‌సిందే…! మేమ‌న‌టం లేదు…సాక్షాత్ జిల్లా  పోలీస్  శాఖే సెల‌విస్తోంది.క‌ రోనా దృష్ట్యా..శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ‌వారి పండుగ రెండు రోజులు భ‌క్తులు పొటెత్త‌కుండా త‌ద్వారా క‌రోనా మ‌ళ్లీ ప్ర‌బ‌ల‌కుండా ఉండేందుకు పోలీస్ శాఖ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నుంది. కొద్ది రోజుల క్రితమే…జిల్లాలోప‌నిచేస్తున్న సిబ్బందితో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు కూడ‌. త‌ద‌నంత‌రం….సోష‌ల్ మీడియా ఇష్టాను సారంగా గాసిప్స్ చక్కెర్లు కొట్ట‌డంతో అస‌లు  పండ‌గ రెండు రోజులు ఏ విధ‌మైన ఆంక్ష‌లు పెట్ట‌నున్నారు..?  పోలీస్ శాఖ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై స‌త్యం న్యూస్. నెట్ ప్ర‌తినిధికి ప్ర‌త్యేకంగా ఎస్పీ దీపికా ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంట‌ర్య్వూ పూర్తి  వివ‌రాలు…ఓసారి చూద్దాం.

ప్ర‌.పండ‌గ ఎలా  నిర్వ‌హిస్తున్నారు….?

జ‌.క‌రోనా ప్ర‌భావం దృష్ట్యా…భ‌క్తులెవ్వ‌రికీ అనుమ‌తి లేదు…! ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వారికే ద‌ర్శ‌నం అనుమ‌తి. అదీ 18,19 రోజులు మిన‌మా మిగిలిన రోజుల్లో మాత్రమే.

ప్ర‌. పండ‌గ‌కు ఎంత  మంది బందోబ‌స్తు…?

జ‌.18,19 తేదీల్లో  తొలేళ్లు,  సిరిమాను ఉత్సవం  జ‌రుగుతున్నందు వ‌ల్ల‌… జిల్లా వ్యాప్తంగా న‌గ‌రానికి బందోబ‌స్తును ఎక్కువ‌గానే  ఏర్పాటు చేస్తున్నామ‌ని,మొత్తం  20 సెక్టార్ల‌లో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నాము. దాదాపు1800 మంది సిబ్బందితో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నాము.జిల్లాల  నుంచీ  ఇత‌రులెవ్వ‌రూ రాకుండా చెక్ పోస్ట్ ల‌ను ఏర్పాటు చేస్తున్నాము.ఆర్డీఓ ద్వార గుర్తింపు కార్డులు ఇస్తున్నాం.

ప్ర‌. డ్రోన్ కెమారాల‌తో బందో బ‌స్తు  నిర్వ‌హిస్తున్నారా..?

జ‌. అవును..జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచీ డ్రోన్ కెమారాల‌ను తెప్పిస్తున్నామ‌ని..సుమారు 5 డ్రోన్ కెమారాల‌తో బందోబ‌స్తు  నిర్వ‌హిస్తున్నామ‌ని అలాగే సిరిమాను తిరిగే దారి మొత్తం సీసీ కెమారాలు పెడుతున్నామన ప్ర‌త్యేకంగా కంట్రోల్ రూంను పెడుతున్నాము. అన్ని సీసీ కెమారాలు ఈ కంట్రోల్ రూంకు అనుసంధాంతో ఉంటుంది.

ప్ర‌. పబ్లిక్ ను  రాకుండా ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.?

జ‌. పైడిత‌ల్లి  అమ్మ‌వారి పండుగ దృష్ట్యా …బందోబ‌స్తుతో పాటు బారికేడ్ల‌ను ఏర్పాటు చేస్తున్నాము.అలాగే మొబైల్ వెహికిల్ ను పెడుతున్నాము. ముందుగానే  మైక్ ల‌లో అనౌన్స్ చేస్తున్నాము.గ‌త ఏడాది ఏ విధంగా  అయితే ప‌బ్లిక్ ర‌ద్దీకి క‌ట్ట‌డి చేసామో…అ విధంగానే ఈ సారి ఇత‌ర జిల్లాల నుంచీ  ఎవ్వ‌రూ రాకుండా క‌ట్ట‌డి చేస్తున్నాము.

ప్ర‌.పైడితల్లి అమ్మ‌వారి పండుగ కు మీరు కొత్త నిజ‌మేనా..?

జ.కాదు…నాకు ఇదివ‌ర‌కే ప‌రిచ‌యం…జిల్లాలోని పార్వ‌తీపురం ఓఎస్డీ గా ప‌ని చేసిన స‌మ‌యంలో బందోబ‌స్తుకు నేను ఉన్నాను.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వాజపేయి

Satyam NEWS

అగ్నిపథ్ పథకంలో లోపాలను సవరించాలి

Satyam NEWS

చీమలపాడు ఘటన బాధకారం

Bhavani

Leave a Comment