28.7 C
Hyderabad
May 15, 2024 01: 15 AM
Slider విజయనగరం

పంచాయతీ ఎన్నికల బందోబస్తు పై విశాఖ రేంజ్ డీఐజీ సమీక్షా సమావేశం

#SPVijayanagaram

పంచాయతీ ఎన్నికల నిర్వహణ పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన విజయనగరం జిల్లా ఎస్పీ…రోజుకో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేంజ్ డీఐజీ రంగారావు… ఎన్నికల నిర్వహణ పై ఎస్ఐ స్థాయి అధికారి నుంచీ డీఎస్పీ స్థాయి వరకూ సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ రాజకుమారీ, అడిషనల్ ఎస్పీల ఆధ్వర్యంలో డీఐజీ..సిబ్బందికి తగు సూచనలు జారీ చేసారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో  ఎస్ ఈ బి అదనపు ఎస్పీ కుమారి. ఎన్.శ్రీదేవి రావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, ఓ ఎస్ డీ ఎన్. సూర్యచంద్ర రావు,

విజయనగరం డీఎస్పీ అనిల్ ,ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ,దిశ డీఎస్పీ త్రినాథ్, సీసీఎస్ డీఎస్పీ పాపారావు, వన్ టౌన్ సీఐ మురళీ ,టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

దావోస్ లో ఇద్దరు మిత్రుల కథ…

Satyam NEWS

ప్రైవేటు స్కూళ్లు జీవో నెం.46 ను ఉల్లంఘిస్తే ఉద్యమం తప్పదు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన‌ ఉపాధ్యాయుల ధ‌ర్నా

Satyam NEWS

Leave a Comment