34.2 C
Hyderabad
April 19, 2024 22: 52 PM
Slider పశ్చిమగోదావరి

మెరుపు వేగంతో కదిలిన పోలీసులు: బాలుడు సేఫ్

#EluruPolice

ఏలూరు పోలీసులు తక్షణమే స్పందించడంతో అదృశ్యం అయిన ఒక పిల్లవాడు క్షేమంగా తిరిగి వచ్చాడు. అదీ కూడా కొన్ని గంటల్లోనే అదృశ్యమైన బాలుడిని పట్టుకోవడం కూడా ఒక ప్రత్యేకత.

ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక  పాఠశాల నుండి ఒక బాలుడు అదృశ్యమయ్యాడని ఫిర్యాదు వచ్చింది.

బాలుడు గురించి వివరాలు అందుకున్న వెంటనే ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ బి ప్రసాద్ సిబ్బంది ని అలెర్ట్  చేశారు. నగరం చుట్టుపక్కల గాలింపు చర్యలు మొదలు పెట్టారు. సోమవరప్పాడు వద్ద షేక్ బాజీ అనే వ్యక్తి ఆ బాలుడిని గమనించి పోలీసు వారికి సమాచారం అందించాడు.

వెంటనే పోలీస్ సిబ్బంది స్పందించి అక్కడ నుంచి బాలుడిని క్షేమంగా తీసుకువచ్చారు. ఈ మొత్తం కార్యక్రమం 30 నిమిషాలలో జరిగింది. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

పోలీసులకు సరైన సమయంలో సమాచారం అందించిన షేక్ బాజీని పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు అభినందించారు. కథ సుఖాంతం అయింది.

Related posts

సంక్రాంతి సందళ్లు

Satyam NEWS

భాషా పండితులు పి.ఈ.టి లకు న్యాయం చేయాలి

Bhavani

విద్యార్ధులకు నోట్ పుస్తకాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment