31.2 C
Hyderabad
April 19, 2024 04: 19 AM
Slider ఆదిలాబాద్

48 టన్నుల రాయితీ బియ్యం పట్టుకున్న  టాస్క్ ఫోర్స్ పోలీసులు

#adilabad police

రెండు లారీల్లో 480 క్వింటాళ్ల రాయితీ బియ్యంను అక్రమ మార్గంలో మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో నేరడిగొండ వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం రెండు గంటల ప్రాంతంలో రెండు లారీల్లో రాయితీ బియ్యం తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి ఆధ్వర్యంలో నేరడిగొండ ఎస్ఐ .భరత్ సుమన్ తో కలిసి అర్ధరాత్రి నుండి నేరడిగొండ జాతీయ రహదారిపై మాటువేసి చాకచక్యంగా TS 12 UC 9458, TS 05 నెంబర్ గల రెండు లారీలను నిలిపివేసి అందులోని 24 టన్నుల చొప్పున రెండు లారీల్లో 48 టన్నుల రాయితీ బియ్యాన్ని డిప్యూటీ తహసిల్దార్ నాగోరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.

నేరడిగొండ ఎస్సై భారత్ సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయితీ బియ్యం సరఫరా చేస్తున్న యజమాని హైదరాబాద్ కు చెందిన భాస్కర్ నల్గొండ జిల్లా మర్రిపాడు మండలంకు చెందిన మాదవేని నర్సయ్య తో  కలిసి లారీలో రాయితీ బియ్యంను మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు ,

పట్టుబడిన ఇద్దరు డ్రైవర్లు నల్గొండ జిల్లా మర్రిపాడు మండలంకు చెందిన మాదగోని రాకేష్, (27),  మాదగోని శివయ్య (24)లను అదుపులో తీసుకొని విచారించగా.నిందితుడు మాదగోని నర్సయ్య సూచన మేరకు భాస్కర్ కు చెందిన రాయితీ బియ్యంను రెండు లారీలు నింపుకొని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు డ్రైవర్లు పేర్కొన్నారని తెలిపారు,

నలుగురిపై కేసు నమోదు చేసి రెండు లారీలు రాయితీ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పౌరసరఫరాల శాఖ అధికారి శ్యాంసుందర్ కు తదుపరి దర్యాప్తు కోసం కేసును అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు, ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏఎస్ఐ ఎస్కే తాజుద్దీన్, శిక్షణ ఎస్సై రాకేష్ గుర్లే, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ లో ఆ రూట్ లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Bhavani

మహిళా దినోత్సవం నేపథ్యంలో విజయనగరంలో పింక్ థాన్ రన్

Satyam NEWS

శాండ్‌విచ్ దీవులలో భూకంపం: అసలు భూకంపాలు ఎలా వస్తాయి?

Satyam NEWS

Leave a Comment