40.2 C
Hyderabad
April 19, 2024 17: 11 PM
Slider విజయనగరం

శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవంలో పోలీసు సేవా దళ్ సేవలు భేష్

#policesevadal

విజయనగరంలో జరిగిన  శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవంలో జిల్లా పోలీసులు అందించిన సేవలను ప్రజలు ప్రశంసించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గర్భిణిలు, వృద్ధులు, దివ్యాంగులకు పోలీసు సేవాదళ్ సభ్యులు సహాయపడి, దర్శనాలు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టారు. అదే విధంగా దర్శనాలకు వచ్చిన భక్తులకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు ఆలయం వెనుగ భాగంలో ప్రత్యేకంగా దిశా స్టాల్ ను ఏర్పాటు చేసి, మహిళా పోలీసుల సహకారంతో భక్తులు దిశా యాప్ డౌన్లోడు చేసుకొనే విధంగాను, దిశా యాప్ వినియోగించే విధానం, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధంగా చర్యలు చేపట్టారు.

దిశ స్టాల్లో దిశ యాప్ పై మహిళలకు అవగాహన

పైడితల్లమ్మవారి పండగ సందర్భంగా అమ్మవారి దర్శనంకు వచ్చిన మహిళా భక్తులకు దిశా యాప్ డౌన్లోడ్ చేసుకొనే విధానం గురించి ఆపద సమయాలలో దిశ ఎస్ఒఎస్ ఏప్ ఉపయోగించి పోలీసు సహాయం పొందే విధానం గురించి అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో దిశా స్టాల్ ను శ్రీ పైడితల్లమ్మవారి గుడి వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. శ్రీ పైడితల్లమ్మవారిని దర్శించుకొనేందుకు వచ్చిన మహిళా భక్తులకు దిశా స్టాల్ లో ఉన్న మహిళా పోలీసులు దిశా యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం గురించి, మహిళలు ఆపద సమయాలలో ఉన్నప్పుడు దిశ ఎస్ఎఎస్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పోలీసులు సహాయం పొందే విధానం గురించి అవగాహన కల్పించారు. విజయగనరం జిల్లా ఎస్పీ దీపిక దిశ ప్రత్యేక స్టాల్ ను సందర్శించి, దిశ యాప్ పట్ల మహిళలకు అవగాహన కల్పించిన విధానాన్ని మహిళా పోలీసులను అడిగి తెలసుకొన్నారు.

గర్భిణీ స్త్రీలను సకాలంలో ఆసుపత్రికి చేర్చిన పోలీసులు

విజయనగరంలో  శ్రీశ్రీశ్రీ పైడితల్లమ్మ వారి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ డైవర్షన్ వలన రద్దీలో చిక్కుకొని, పురిటి నొప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ధర్మపురి గ్రామానికి చెందిన గర్భవతిని బాడంగి ఎస్ఐ నరేష్ గమనించి, ప్రత్యేక చొరవ తీసుకొని, ఆమెను ఆటోలో ఘోసాసుపత్రి వరకు ఎస్కార్టుగా వెళ్ళి, ఆమెను అసుపత్రిలో జాయిన్ చేసి, వారి కుటుంబ సభ్యుల మన్ననలు పొందారు.

అదే విధంగా కోట జంక్షన్ వద్ద బ్యారికేడ్లుకు అవతల ఉన్న ఒక గర్బిణి నొప్పులతో ఇబ్బంది పడుతుండడంతో అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న డెంకాడ ఎస్ఐ  పద్మావతి గమనించి, సకాలంలో స్పందించి, అమెను 104 వాహనంలో స్వయంగా ఆసుపత్రికి తరలించి, అందరి మన్ననలు పొందారు.

వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలకు సేవలందించిన పోలీసు సేవాదళ్

శ్రీ పైడితల్లమ్మ దేవాలయం వద్ద దర్శనంకు వచ్చే వృద్ధులు, గర్భిణిలు, దివ్యాంగులు దర్శనం సులువుగా చేయించే విధంగా వారిని ఆలయంకు తీసుకుని వెళ్లి పోలీసు సేవాదళ్ సభ్యులు సేవలందించి ప్రజల మన్ననలు పొందారు.

Related posts

తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర లేదు

Satyam NEWS

నిరుపేదలకు సాయం అందించడమే సర్వర్ చారిటబుల్ ట్రస్టు ధ్యేయం

Satyam NEWS

ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్‌

Sub Editor

Leave a Comment