28.2 C
Hyderabad
January 21, 2022 16: 21 PM
Slider సంపాదకీయం

కక్ష సాధింపులు వద్దు… ఇప్పటికైనా మారండి

#raghurama

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పై పగ చల్లారినట్లు కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏపి సీబీసీఐడి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఏ విధంగా స్పందించాలో ఎవరికి అర్ధం కావడం లేదు.

ప్రతి రోజూ మీడియా సమావేశాలు పెట్టి వివిధ అంశాలను ప్రస్తావిస్తున్న రఘురామకృష్ణంరాజును కట్టడి చేసేందుకే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఆ దిశగా తీసుకున్న నిర్ణయాలు ఫలించకపోవడంతో తదుపరి చర్యలకు ఏపీ సీబీ సీఐడి పోలీసులు ఉపక్రమిస్తున్నారు.

అందులో భాగంగానే ఆయన మళ్లీ నోటీసులు జారీ చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. తనకు సీబీసీఐడీ నోటీసులు జారీ చేయడంపై రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసుల విచారణకు తాను హాజరవుతానని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు కూడా.

అయితే పోలీసులు కూడా చట్టాన్ని గౌరవించాలని ఆయన కోరుతున్నారు. ఈ సందర్భంగా న్యాయ నిపుణులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎంపీ రఘురాం కృష్ణరాజు కేసులో గత మే 17 న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమిటి? ఏపీసీఐడి పోలీసులు చేస్తున్న దేమిటి?

ఏపి హైకోర్టు ఆదేశించిన మేరకు ఏపిసిఐడి పోలీసులపై కంటెమ్ట్ కేసు ఏమైంది? ఏపి పోలీసులు ఆరు వారాల్లోగా దాఖలు చేయాల్సిన కౌంటర్ అఫిడవిట్ ఏమైంది? ఆరు వారాల్లో విచారణకు రావాల్సిన కేసు ఆర్నెల్లు దాటినా సుప్రీంకోర్టు లో విచారణకు ఎందుకు రావడం లేదు?

మానవ హక్కుల సంఘానికి ఎంపి రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ ఇచ్చిన ఫిర్యాదు పై ఏపి ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీలు ఏమిటి? సభాహక్కుల సంఘం ఇచ్చిన నోటీసులకు హోంశాఖ ద్వారా వచ్చిన నోటీసులకు ఏపి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏమిటి?

కస్టోడియల్ టార్చర్ గా అభివర్ణించిన సుప్రీం కోర్టు ధర్మాసనానికి ఏపి సీబీసిఐడి పోలీసులు ఇచ్చిన సంజాయిషీ ఏదీ? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే వీటన్నింటికి సమాధానం చెప్పాల్సింది ఏపి సీబిసిఐడి పోలీసులే. అయితే వారు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేరని మళ్లీ నోటీసు జారీ చేయడంతో తేటతెల్లం అయింది.

ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న రఘురామకృష్ణంరాజునే ఇంతగా వేధిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పే నాథుడు కనిపించడం లేదు. అదే విషాదం.

రాజకీయ కక్షలకు పోలీసులు సహకరిస్తున్నారనే విమర్శలు పెల్లుబుకుతున్న తరుణంలో పోలీసుల విశ్వసనీయగ తగ్గిపోతున్నది. పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తగ్గిపోతే సమాజంలో కట్టుబాట్లు అదుపుతప్పుతాయి. అదే ఇప్పుడు భయం కలిగిస్తున్నది.

ఏపి పోలీసులు గత రెండున్నర సంవత్సరాలుగా తమ విశ్వసనీయతను పణంగా పెట్టి పని చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు పత్రికలు, రెండు ఛానెళ్లు విష ప్రచారం చేస్తున్నాయి అనే వాదన ఇప్పుడు నిలబడటం లేదు.

జరుగుతున్న పరిణామాలు ఇలా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు అంటూ ఎదురు ప్రశ్న వస్తున్నది. ఈ ఎదురు ప్రశ్న రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కష్టాలు తెచ్చి పెడుతుంది. పోలీసుల విశ్వసనీయత తగ్గిపోతే ప్రభుత్వ విశ్వసనీయత కూడా తగ్గుతుంది. అందుకే ఇప్పటికైనా పోలీసులు కక్ష పూరిత ధోరణి విడనాడాలి.

ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది కాబట్టి పాలకులు పోలీసులపై వత్తిడి తీసుకురాకుండా వారు చట్ట ప్రకారం పని చేసే విధంగా స్వేచ్ఛ కల్పించాలి. అలా చేయని రోజు ముఠా కక్షల స్థాయికి పోలీసుల కేసులు కూడా చేరతాయి. అప్పుడు విపరీత పరిణామాలు ఏర్పడతాయి.

Related posts

సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం మీకు ఇష్టం లేదా సారూ?

Satyam NEWS

ప్రభుత్వ విధానంలో మార్పు చేయమని కోరకూడదు

Satyam NEWS

అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి గురుమూర్తి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!