32.2 C
Hyderabad
April 20, 2024 20: 15 PM
Slider విజయనగరం

దుర్గాష్టమి కారణంగా పోలీసు “స్పందన” రద్దు

#spdepika

దుర్గాష్టమి నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజల నుంచీ ఫిర్యాదుల రూపంలో చేపడుతున్న “స్పందన”ను రద్దు చేస్తున్నట్టు విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా తెలిపారు. ఇక గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ జయింతిలను తమ కార్యాలయంలో నిర్వహించారు.. పోలీసు బాస్.

ఈ మేరకు ఆర్మర్డ్ రిజర్వ్ అడ్మిన్ చిరంజీవి.. ఆధ్వర్యంలో పోలీసు శాఖ..బ్యారెక్స్ లో జయంతి వేడుకలను నిర్వహించసాగింది. ఈ సందర్భంగా పోలీసు బాస్ దీపికా.. తన కొడుకుతో సహా వచ్చి.. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ 153వ జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.

ఈ జయంతి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక పాల్గొని, మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – సమాజంలో శాంతియుత స్థాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం అన్నవి ప్రతీ ఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలన్నారు.

“సమాజంలో ఏమార్పునైతే మనము కోరుకొంటున్నామో.. అటువంటి మార్పు ముందుగా మనతోనే ప్రారంభం కావాలని” మహాత్ముడి భోదనలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. సమాజంలో శాంతిని ఎల్లప్పుడూ కోరుకొనే పోలీసుశాఖ అయితే గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే పయనించి, ప్రజల్లో మార్పును తీసుకొని రావాలన్నారు. సమాజంలో అందరిని మంచి పౌరులుగా మనము మార్చలేకపోయినా, కొద్ది మందినైనా హింసా ప్రవృత్తి నుండి దూరం చేసి, వారిని అహింసా మార్గం లో పయనించే విధంగా పోలీసు ఉద్యోగులు తమవంతు కృషి చెయ్యాలన్నారు.

మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి, నిజాయితీతో, దేశం పట్ల గౌరవం, భక్తి, ప్రవర్తులు కలిగి, శాంతిభద్రత లకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చెయ్యాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల వైపు యువత ఆకర్షితులైతే, వారికి కౌన్సిలింగు నిర్వహించి, వారిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా పెద్దలు మార్గాన్ని నిర్ధేశం చేయాలన్నారు.

హింసాత్మక సంఘటనలు నుండి యువత ప్రేరణ పొందవద్దని, ప్రతీ ఒక్కరూ గాంధీజీ చూపిన అహింసా మార్గంలో నడవాలని, పోలీసులకు సహకరించాలని యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక పిలుపు నిచ్చారు.అనంతరం, అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్బీ సిఐ సిహెచ్.రుద్రశేఖర్, డిసిఆర్బి సిఐ జె.మురళి, ఆర్ఐలు చిరంజీవరావు, నాగేశ్వరరావు, ఎస్ఐ వాసుదేవ్, సత్యన్నారాయణ, ఆర్ఎస్ఐలు విజయ్ కుమార్, శ్రీనివాసరావు, మరియు ఇతర పోలీసు అధికారులు, ఎఆర్ మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు, పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

దుర్గాష్టమి సెలవుతో “స్పందన” రద్దు

దుర్గాష్టమి పర్వ దినం సందర్భంగా శెలవు కారణంగా ఈ నెల 3వ తేదీ  సోమవారం నిర్వహించాల్సిన “స్పందన” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. కావున, ప్రజలెవ్వరూ “స్పందన” ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి, ఇబ్బందులు పడవద్దన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిందిగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

Related posts

కట్టలు తెగిన కరెన్సీ.. ఓటుకు రూ.3 వేలు!

Satyam NEWS

అక్కడ ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐ లకు ఒకే ఒక్క జీపు డ్రైవర్..!

Satyam NEWS

సర్టిఫైడ్ బిచ్చగాడు అఖిలేష్ యాదవ్‌ : ఒవైసీ

Sub Editor

Leave a Comment