31.2 C
Hyderabad
April 19, 2024 05: 06 AM
Slider ప్రత్యేకం

విజ‌య‌న‌గ‌రం టూటౌన్ పీఎస్ కొత్త భ‌వ‌నాన్ని ప్రారంభించిన పోలీస్ చీఫ్

#dgpgowtamsavang

విద్య‌ల న‌గ‌రమైన  విజ‌య‌న‌గ‌రానికి రెండోసారి రాష్ట్ర డీజీపీ గౌతం స‌వాంగ్  వ‌చ్చారు.  న‌గ‌రంలోని కొత్త‌పేట నీళ్ల  ట్యాంక్ వ‌ద్ద  దాదాపు కోటి 60 ల‌క్ష‌ల‌తో నిర్మించిన టూటౌన్ కొత్త పోలీస్  స్టేష‌న్ భ‌వనాన్ని డీజీపీ ప్రారంభించారు.. స‌రిగ్గా  ఉదయం  09.55 నిమిషాల‌కు విశాఖ నుంచీ నేరుగా వ‌చ్చిన డీజీపీని…కొత్త స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ, ఎస్పీ దీపికాలు స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం శాఖ‌కు చెందిన ముగ్గురు ఏఎస్పీలు, ముగ్గురు  డీఎస్పీలు, అయిదుగురు సీఐలు  డీజీపీకి  పుష్ప‌గుఛ్చం ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డ గ్యాల‌రీలో కూర్చున్న స్థానిక ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర‌స్వామి, జెడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు,విజ‌య‌న‌గ‌రం ఎంపీ బెల్లాన న‌చంద్ర‌శేఖ‌ర్ , మేరిటైమ్ బోర్డ్ చైర్మ‌న్ కేవీఆర్ ల‌ను డీజీపీకి ప‌రిచయం చేసారు..ఎస్పీ  దీపికా. కొద్దిసేప‌టికి డిప్యూటీ సీఎం పాముల పుష్ప‌శ్రీవాణి రావ‌డంతో అంతా క‌లిసి స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లోనే ఏర్పాటు చేసిన శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో డీజీపీ మాట్లాడుతూ…పోలీస్ వ్య‌వస్థ‌..సామాన్య‌,పేద ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం కోసమే ప‌ని చేస్తోంద‌ని…. సేవ  చేయ‌డమే మా శాఖ ల‌క్ష్య‌మ‌న్నారు.అందునా మ‌హిళాపోలీసుల‌కు సేవ చేయ‌డ‌మే కాకుండా వారికే  అదిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని చెప్పారు  ఈ సంద‌ర్బంగా  ప్ర‌బుత్వం విడుద‌ల చేసిన జీఓ నెంబ‌ర్ 1ని ప్ర‌స్తావిస్తూ…పోలీస్ వ్య‌వ‌స్థ‌లో మ‌హిళ‌ల‌ను భాగ‌స్వామ్యుల‌ను చూసే…మ‌హిళా సంర‌క్ష‌ణ పోలీస్  వ్య‌వ‌స్థ ను…తీసుకొచ్చింద‌న్నారు.

పురుషుల‌తో పాటు మ‌హిళ‌ల‌కు కూడా అందునా పోలీస్ శాఖ‌లో ప్రాధాన్య‌త  క‌ల్సిస్తూ గ్రామానికో ఎంఎస్పీల‌ను  నియ‌మించామ‌ని డీజీపీ గౌతంస‌వాంగ్ తెలిపారు. అనంత‌రం ఎంఎస్పీల నుద్దేశించి స‌చివాల‌య వ్య‌వస్థ‌కు మీరే ఆద‌ర్శ‌మ‌ని తద్వారానే ప్ర‌భుత్వం మంచి గుర్తింపు తేవాల‌ని డీజీపీ వారినుద్దేశించి అన్నారు.

ఈ సంద‌ర్బంగా జిల్లాలోని కొత్త‌వ‌ల‌స  స‌చివాల‌యంలో ఎంఎస్పీగా అనితా మార్గెట్ ను  డీజీపీ అభినందించారు.కార్య‌క్ర‌మాన్ని మొత్తం…ఏఎస్పీ,విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్డీ డీఎస్పీ  అనిల్ అధ్య‌క్ష‌త వ‌హించారు.డీజీపీతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, విజ‌య‌న‌గ‌రంఎంపీ బెల్లాన‌చంద్ర‌శేఖ‌ర్, ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర‌స్వామి, ఎంఎల్సీ ర‌ఘువ‌ర్మ‌,లు కూడా ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నేతల ఉపాధి హామీ పథకంలా కరోనా మహమ్మారి

Satyam NEWS

ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజీనామా

Satyam NEWS

1xbet официальный Сайт 1xbet Зеркало Казино И Регистрация В Бк

Bhavani

Leave a Comment