38.2 C
Hyderabad
April 25, 2024 11: 52 AM
Slider ముఖ్యంశాలు

డీజీపీ ఆదేశాల‌తో పీఎస్ ల‌లో మార‌నున్న రిసెప్ష‌న్ కౌంట‌ర్లు..!

#FriendlyPolice

పోలీస్ అంటే ప్ర‌జ‌ల‌కు అండ‌, పోలీస్ అంటే ప్ర‌జ‌ల‌కు  భ‌ద్ర‌త‌, పోలీస్ అంటే ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌..పోలీస్ స్టేష‌న్లు ఆ విధంగా ఉండాల‌ని ఏపీ రాష్ట్ర డీజీపీ….అన్ని జిల్లాల ఎస్పీల‌కు సూచించారు. దీంతో రాష్ట్రంలో అన్ని రేంజ్ ల డీఐజీలు…త‌మ‌,త‌మ ప‌రిధులలో ఉండే అన్నీ పోలీస్ స్టేష‌న్ల‌లో రిసెప్ష‌న్ కౌంట‌ర్లు ఆధునికంగా తీర్చిదిద్దాలని ఎస్పీల‌కు ఆదేశించారు.

ఈ నేప‌ధ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు…త‌న ప‌రిధిలో ఉన్న విశాఖ‌ప‌ట్నం,విజ‌య‌న‌గ‌రం,శ్రీకాకుళం జిల్లాలలో ఉన్న అన్ని పోలీస్ స్టేష‌న్ల‌లో ఉన్న రిసెప్ష‌న్ కౌంట‌ర్లు అధునాతనంగా తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు. దీంతో విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో ప్ర‌ధాన స్టేష‌న‌మైన వ‌న్ టౌన్..అఆగే  టూటౌన్, రూర‌ల్ పీఎస్ లు. సక‌ల హంగుల‌ను  సంత‌రించుకున్నాయి.

పోలీస్ అంటే మీ సేవ లోనే 

మీ సేవ లోనే  అన్న అక్ష‌రాల‌తో రాసి మ‌రీ…అన్ని స్టేష‌న్ ల‌లో రిసెప్ష‌న్ కౌంట‌ర్లు రూపుదిద్దుకోబోతున్నాయి. ఇప్ప‌టికే విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మొద‌టి అంత‌స్థులో ఉన్న రిసెప్ష‌న్ కౌంట‌ర్ ను సక‌ల హంగుల‌తో తీర్చిదిద్దారు.

స్టేష‌న్ కు వచ్చిన ఫిర్యాదుదారుడిని మ‌ర్యాద గా కూర్చోబెట్టేవిధంగా సిట్టింగ్ ఏర్పాటు చేసారు. అలాగే ముందుగా స్టేష‌న్ కు వ‌చ్చిన వారిని మీకేం కావాలంటూ ప్ర‌త్యేకించి ఓ కానిస్టేబుల్ పెట్టి మరీ అడుగుతూ పోలీసుల‌తో మ‌మేక‌మ‌వుతున్నాయి.

స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ప‌రిష్క‌రించే య‌త్నం

ఇప్పటికే పీస్ క‌మిటీలు, మహిళా ర‌క్ష‌క పోలీసులు…వార్డులు,గ్రామాల‌లో స్థానికుల‌తో మ‌మేక‌మై…వారి స‌మ‌స్య‌ల‌ను ఫిర్యాదు చేసేంత‌వ‌ర‌కు వెళ్ల‌కుండా.ఆయా స్వ‌స్థ‌లాల‌లోనే స‌మ‌సిపోయేలా చూస్తున్నారు.వాళ్లు ప‌రిష్క‌రించ‌నివి….పిర్యాదు రూపంలో స్టేష‌న్ కు వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను సంబంధిత వాళ్ల‌తో స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ప‌రిష్క‌రించే య‌త్నం చేసారు.

అదీ వీలు కాక‌పోతే సంబంధిత ఎస్ఐ,ఇన్ స్పెక్ట‌ర్ లు  స్టేష‌న్ కు పిలిపించి స‌మ‌స్యను కేసు క‌ట్టేంత‌వ‌ర‌కు వెళ్ల‌కుండా చూస్తారు. ఇలా స్టేష‌న్ కు వ‌చ్చే వారిని…కొత్త‌గా  రూపుదిద్దుకుంటున్న రిసెప్ష‌న్ కౌంట‌ర్లలో కూర్చొబెట్టి స‌మ‌స్య ను ప‌రిష్క‌రించి త‌ద్వారా పోలీస్ అంటే…భ‌రోసా కల్పించే య‌త్నాలు చేస్తున్నారు.

ఏదైనా స్టేషన్ ల‌లో ఆదునాత రీతిలో రూపుదిద్దుకుంటున్న రిసెప్ష‌న్ కౌంట‌ర్లు….సంబంధిత స్టేష‌న్లకు స‌మ‌స్య‌ల‌తో వ‌స్తున్న‌ స్థానికుల‌లో మార్పు వ‌స్తుంద‌ని  మ‌న‌మూ ఆశిద్దాం.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్,  విజయనగరం

Related posts

అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా తగ్గిన క్రూడాయిల్ ధర

Bhavani

Statue of belief: ప్రపంచంలో అత్యంత ఎత్తైన కైలాసనాథుడి విగ్రహం రెడీ

Satyam NEWS

వైద్యశాలలో స్కానింగ్ సెంటర్,రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment