30.7 C
Hyderabad
February 10, 2025 21: 42 PM
Slider ఆధ్యాత్మికం

శబరిమల ఆలయం వద్ద 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

sabarimala_deity

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద 12 ఏళ్ల బాలికను ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రి, బంధువులతో పాటు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు బాలిక వచ్చినట్లు తెలిసింది. అయితే.. ఆ బాలిక వయసు నిర్ధారించే నిమిత్తం పోలీసులు ఫ్రూఫ్స్ చెక్ చేశారు. అనంతరం.. ఆమె వయసు 12 సంవత్సరాలుగా పోలీసులు తేల్చారు. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని 1991లో కేరళ హైకోర్టు చట్టబద్ధం చేసింది. 2018, సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అయ్యప్పను పూజించవచ్చని తీర్పు వెల్లడించడంతో కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం, భక్తులు వారిని అడ్డుకోవడం.. ఘర్షణ జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు. సుప్రీం తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై స్పష్టత వచ్చేవరకూ అన్ని వయసుల మహిళలకు అయ్యప్ప దర్శనం వీలుపడకపోవచ్చని తాజా ఘటనతో స్పష్టమైంది.

Related posts

ఆరోగ్యశాఖ మంత్రి పర్యటనను అడ్డుకుంటాం

Satyam NEWS

హునార్ హాట్: హస్త కళా ప్రదర్శన ప్రారంభించిన కేంద్ర మంత్రి

Satyam NEWS

తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధం

mamatha

Leave a Comment