రూ.25,000 కోట్ల ఎంఎస్ సి బ్యాంకు కుంభకోణానికి సంబధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కు నేరుగా వెళ్లి వివరణ ఇవ్వాలన్న ఆలోచనను పోలీసులు అడ్డుకున్నారు. శరద్ పవర్ ను దోషిగా చూపిస్తూ ఎన్ పోర్సుమెంటు డైరెక్టరేట్ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన పలు దఫాలుగా పార్టీ నాయకులతో, న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం ఇడి ఆఫీసుకే వెళ్లి వివరణ ఇవ్వాలని అనుకున్నారు. ఇలా చేయడం వల్ల త్వరలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్యలో తన ప్రచారానికి అవాంతం రాకుండా ఉంటుందని కూడా ఆయన భావించారు. శరద్ పవర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇడి కార్యాలయం వద్దకు ఎన్ సి ఫి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడం ప్రారంభించారు. ఎన్ సి పి కార్యకర్తల ప్రవాహాన్ని అడ్డుకోలేమని భావించిన ముంబయి పోలీసులు ఆయనను ఇల్లు దాటి బయలకు రావదని నిలుపుదల చేశారు. ఇడి కార్యాలయం శరద్ పవర్ నివాసానికి దగ్గరలోనే ఉంటుంది. అయితే పోలీసులు ఆయనను ఆపివేయడంతో తాను ఇడి కార్యాలయానికి వెళ్లడం లేదని శరద్ పవర్ ప్రకటించారు