36.2 C
Hyderabad
April 18, 2024 14: 44 PM
Slider విజయనగరం

ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులతో ఎస్పీ సహపంక్తి భోజనం

#VijayanagaramSP

ప్రతీ ఏటా నిర్వహించే చర్యలలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తన బంగ్లాలో పోలీస్ స్టూడెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ఎస్పీ కలిసి భోజనం చేసారు.

తాను ఓ పోలీసు అధికారిని…విద్యార్ధులు అందునా పిల్లలతో కలిసి భోజనం చేయడం ఏంటన్న ఆలోచనకు స్వస్థి చెప్పి…విద్యార్థులతో మమేకమై పిల్లల్లో పోలీసులంటే భయం లేక…పోలీసు అంటే ధైర్యం కల్పించేందుకు… శాఖా పరంగా స్టూడెంట్ పోలీసు కేడెట్ అన్న ప్రోగ్రాం తో..దాదాపు 41 స్కూళ్ల విద్యార్థుల తో ఎస్పీ రాజకుమారీ సహపంక్తి భోజనం చేసారు.

జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తుది పరీక్షలకు ఉపయోగపడే ఆల్-ఇన్-ఒన్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బంగ్లాలో  నిర్వహించారు.

జిల్లా కలెక్టరు డాక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ ముఖ్య అతిధిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ తమ శాఖ ద్వారా 41 ప్రభుత్వ పాఠశాలలను దత్తత స్వీకరించి, విద్యార్ధులలో శక్తి సామర్థ్యాలను పెంచి, వారిని ఉన్నతమైన స్థానాలకు తీసుకు వచ్చేందుకుగాను, స్టూడెంట్ పోలీసు క్యాడెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి ఫలితాలు సాధించే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు శక్తి వంచన లేకుండా విద్యార్ధుల ఉన్నతికి కృషి చేయాలన్నారు. బాగా చదువుకోవడం వలన మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, విజయనగరం అంటే విద్యలనగరమని, ఆ పేరుకు సార్ధకత తీసుకువచ్చే విధంగా చదవాలన్నారు.

పోలీసుశాఖ వలన క్రమశిక్షణ అలవడుతుందని, క్రమశిక్షణ ద్వారా పట్టుదలను పెంచుకొని, బాగా చదివి ఉన్నతమైన స్థానాలలోకి ఎదిగి, మీ తల్లిదండ్రులను, మంచి పేరు తీసుకువచ్చి, మీ ప్రాంతాలను అభివృద్ది చెయ్యాలని జిల్లా కలెక్టరు ఆకాంక్షించారు.

క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత లక్ష్యాలను లక్ష్యంగా చేసుకొని, ఉన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా ఎదగాలన్నారు.

స్టూండెంట్ పోలీసు క్యాడిట్ కార్యక్రమంలో విద్యార్ధులకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం చాలా హర్షణీయమని, విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని వృధా చేయకుండా బాగా చదివి 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టరు అన్నారు.

అనంతరం  జిల్లా ఎస్పీ  రాజకుమారి మాట్లాడుతూ – విద్య ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చునని అన్నింటికీ మూల కారణం విద్యే అన్న సత్యాన్ని ప్రతీ విద్యార్థి గ్రహించాలన్నారు. విద్య ద్వారా వినయం, తద్వారా సమర్ధత, సంపద, ధర్మం, సంతోషం వస్తాయన్నారు.

విద్యార్ధి దశలో వినయం, సమయపాలన, శ్రద్ధ, ఆసక్తి, సానుకూల దృక్పథం, నీతి, నియమాలు అలవరుచుకోవాలన్నారు. ఎపిసి పాఠశాలలకు ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ రంగారావు విజయనగరం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో విద్యార్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించారని, అప్పటినుండి ఎస్పీలుగా పనిచేస్తున్న వారంతా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారన్నారు.

ఈ సంవత్సరం పోలీసు సంక్షేమ నిధి నుండి 4 లక్షల వ్యయంతో ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను ఎపిసి పాఠశాల విద్యార్ధులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, విద్యార్ధులు పట్టుదలతో చదివి జూన్ లో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో 10/10 గ్రేడు మార్కులు సాధించాలన్నారు.

విద్యార్థి దశలో 8, 9, 10 మరియు ఇంటర్మీడియట్ చాలా ముఖ్యమైనవని, ఈ దశలో విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు.

మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన విద్యార్థులలో ఉండాలని, విద్యార్ధి దశ మళ్ళీ రాదని, తల్లిదండ్రులు మనికిచ్చిన అవకాశాన్ని, ఉపాధ్యాయులు మనకి నేర్పిస్తున్న జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకొనిరాబోతున్న 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, మీపై మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకొన్న నమ్మకాన్ని నిలపాలన్నారు.

క్రమశిక్షణ, అంకితభావం, మంచి వ్యక్తిత్వం ద్వారా ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకు విశ్రమించ కూడదన్నారు. విద్యార్ధి దశలో 10వ తరగతి చాలా కీలకమైనదని, సమయం చాలా విలువైనదని, సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగపర్చుకొని, ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను చదివి, మంచి ఫలితాలు సాధించాలన్నారు.

ఒక ప్రణాళిక ప్రకారం ఎస్.పి.సి. కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత 10 పాఠశాలలను ఎంపిక చెయ్యగా, వాటికి అదనంగా మరో 31 పాఠశాలలను ఎంపిక చేసామన్నారు.

ఈ కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో ప్రతీ విద్యార్ధితోనుపోలీసు అధికారులు కలిసి మాట్లాడి, వారిలో స్ఫూర్తి కలిగించడం వలన మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు మాట్లాడుతూ – విలువలతో కూడిన విద్య నేర్వాలని, దేవుడిచ్చిన సృజనాత్మకతను వెలికితీయాలన్నారు.

విద్యను మన నుండి ఎవరూ తీసుకోలేరని, విద్య వలన కీర్తిని పొందవచ్చునన్నారు. ఆచార్యదేవోభవ అని, పిల్లల్ని తీర్చిదిద్దిన గురువులను అభినందించాలన్నారు. ఆల్-ఇన్-ఒన్ పుస్తకాలను సద్వినియోగం చేసుకొని రాబోయే 10 వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలన్నారు.

అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి మాట్లాడుతూ – పోలీసు శాఖ తమ విధులలో బిజీగా ఉంటున్నా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ స్టూడెంట్ పోలీసు క్యాడిట్ కార్యమ్రాన్ని విజయవంతంగా అమలు చేసి, విద్యార్థులలో ఆత్మసైర్యాన్ని నింపుతున్నారని, గతంలో ఈ కార్యక్రమం ద్వారా అందించిన సహాయం వలన 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు జిల్లాకు వచ్చాయని, మళ్ళీ మంచి ఫలితాలను సాధించి, రాష్ట్రంలో జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.

విజయనగరం విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి చేతుల మీదుగా 14 ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ఆల్-ఇన్-ఒన్ స్టడీ మెటీరియల్ ను అందజేసారు. విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీతో పాటు ఎస్ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు,  అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డీఈఓ జి.నాగమణి మరియు ఇతర అధికారులు సహపంక్తి భోజనాలు చేసి, పరీక్షల గురించి, ప్రిపరేషను గురించి ఆరా తీసి, వారిలో స్ఫూర్తి నింపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఎస్ ఈబి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఒఎస్డీ. ఎన్. సూర్య చంద్రరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, డిఈ ఒ జి. నాగమణి, ఎస్పీసి నోడల్ అధికారి ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, విజయనగరం డి.ఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహన రావు, డిఎస్పీ ఎస్ సి ఎస్ సెల్-1 మరియు 2 ఆర్. శ్రీనివాసరావు,

రామారావు, సిఐలు బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాస రావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, జె. మురళి, సిహెచ్. శ్రీనివాసరావు, ఎర్రంనాయుడు, టి.ఎస్. మంగవేణి, శ్రీధర్, జి. గోవిందరావు, సింహాద్రినాయుడు, టి.వి. తిరుపతిరావు, సిహెచ్. లక్ష్మణరావు, సంజీవరావు, ఎల్.అప్పలనాయుడు, ఆలు చిరంజీవి, బి. నాగేశ్వరరావు, కుమార్, ఈశ్వరరావు, రమణమూర్తి, పి.ఎం. రాజు మరియు ఇతర పోలీసు అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

Satyam NEWS

(Professional) Weight Loss Anxiety Pills New Skinny Pill Controversy At What Age Can You Take Weight Loss Pills

Bhavani

‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ట్రైలర్ విడుదల

Satyam NEWS

Leave a Comment