31.7 C
Hyderabad
April 19, 2024 00: 56 AM
Slider గుంటూరు

తెలుగు యువత నేత గొంతు నులిమిన పోలీసులు

#gunturTDP

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న తెలుగు యువత విద్యార్థి నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. పోలీసులు పోలీసుల్లాగా విధినిర్వహణ చేయాలి కానీ వైసీపీ కార్యకర్తల్లా కాదని వారన్నారు. గుంటూరు స్పెషల్ బ్రాంచ్ సి ఐ ఎమ్.శ్రీనివాస్, మేడికొండూరు సి ఐ అల్తాఫ్ హుస్సేన్ తమ కార్యకర్తల గొంతునులిమి దాష్టీకం చేశారని వారన్నారు.

శాంతియుతంగా ఉన్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటంతో పాటు గొంతు నులుముతు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మీడియా ప్రతినిధులపైనా దాష్టికాన్ని చేసిన పోలీసు చర్యల్ని ఖండిస్తున్నామని వారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ చెయ్యాలని కోరుతూ తెలుగుయువత ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుతో పాటు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న యువత విద్యార్థి నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రికత్త కు దారితీసింది.

గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ను ఉద్దేశపూర్వకంగా ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేసి దాష్టికానికి పాల్పడటం దారుణం అని వారన్నారు. చొక్కాలు గొంతుకు మెలేసి ఈడ్చుకెళ్లటమే కాక వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ ఎస్బి సి ఐ  ఎమ్ .శ్రీనివాస్ అరాచకాన్ని రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఖండించారు.

Related posts

Big blast: తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబులు

Satyam NEWS

కొత్తపేట నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న వైసీపీ

Satyam NEWS

పదో తరగతి పరీక్షాఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిన ములుగు జిల్లా

Satyam NEWS

Leave a Comment