32.7 C
Hyderabad
March 29, 2024 11: 07 AM
Slider మెదక్

దుబ్బాకలో ట్రబుల్ మేకర్లను బైండోవర్ చేయండి

#SiddipetPolice

గత ఎన్నికలలో కేసులు నమోదైన వారిని బైండోవర్ చేయాలని పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. త్వరలో జరిగే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక దృష్టిలో ఉంచుకుని ఆయన నేడు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గత ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ కేసుల గురించి ఎస్ఐ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామానికి కేటాయించిన విపిఓల గురించి అడిగారు.

ఈ సందర్భంగా కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ విపిఓలు తరచుగా గ్రామాలను సందర్శించి, ఎలక్షన్స్ కు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. గత ఎన్నికలలో గొడవలు జరిగిన గ్రామాలలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

ప్రతి విపిఓ గ్రామాలను సందర్శించినప్పుడు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, యువజన సంఘాలతో కలసి వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని గ్రూప్ లలో సమాచారాన్ని పంపించాలన్నారు.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏ విధంగా పని చేస్తున్నాయో తనిఖీ చేయాలన్నారు, పనిచేయని సీసీ కెమెరా సీసీ కెమెరాలు వెంటనే రిపేర్ చేయించాలన్నారు.

సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి త్వరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.

 కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి, శానిటైజర్ వెంబడి ఉంచుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, దుబ్బాక సిఐ హరికృష్ణ గౌడ్, మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ స్టేషన్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Related posts

కువైట్ లో తెలుగు వారి కన్నీటి కష్టాలు

Satyam NEWS

శ్రీనివాస సేతు మూడవ దశ పనులు త్వరితగతిన పూర్తి

Satyam NEWS

భారత్ లో ఉండటం క్షేమం కాదు వెంటనే వచ్చేయండి

Satyam NEWS

Leave a Comment