37.2 C
Hyderabad
April 19, 2024 12: 47 PM
Slider ముఖ్యంశాలు

విజయనగరం ఎస్ పి చొరవతో పురోగమిస్తున్న స్టూడెంట్ పోలీస్ కేడిట్

#Police Training

స్టూడెంట్ పోలీస్ కేడిట్…. 8,9 త‌ర‌గ‌తులు చ‌దివే విద్యార్దుల‌లో దాగి ఉన్న‌నైపుణ్యం,నైతిక‌త‌ను పెంపొందించే విధానం. కేంద్ర నిధుల‌తో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజ‌న వాడ‌ల‌లో పేద‌ర‌కంలోనూ అందున ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న విద్యార్ధులకు ఉన్న‌త భావాలు,ల‌క్ష్యాల‌ను అభివృద్ది చేయ‌డ‌మే ఎస్.పీ.సీ ఉద్దేశ్యం. 

బ్యూరో ఆఫ్ రీసెర్చ్ డ‌వ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రామ్ ద్వారా  ఈ స్టూడెంట్ పోలీస్ కేడిట్ ను ప్రారంభించిన కేంద్ర ప్ర‌భుత్వం.. కొన్ని జిల్లాల నుంచీ ఎంపిక చేసుకుని దీన్ని ప్రారంభించింది.

తొలిసారిగా కేర‌ళ‌లో ప్రారంభించ బ‌డ్డ స్టూడెంట్ పోలీస్ కేడిట్…2017 లో ఏపీ రాష్ట్రంలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మొద‌లైంది. ఎస్పీ పాల్ రాజు హాయంలో  అప్ప‌టికి ఏడాది క్రితం ప్రారంభ‌మైన‌ ఈ కార్య‌క్ర‌మాన్ని 2018లో జిల్లాకు ఎస్పీగా వ‌చ్చిన రాజ‌కుమారీ…మ‌రింత శ్రద్ద,దృష్టి పెట్టారు.

గ్రామీణ విద్యార్దులు,యువ‌త‌పై అత్యంత మ‌క్కువ పెట్టి స్టూడెంట్ పోలీస్ కేడిట్ ద్వారా వాళ్ల‌ను ఉత్త‌మ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎస్.పీ.సీ ద్వారా బీజం నాటారు. 8,9 చ‌దివే విద్యార్దుల‌కు పోలీస్ అంటే ఇలా ఉండాలి..ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉంటేనే దేశానికి,స‌మాజానికి సేవ చేస్తాడ‌ని పెంపొందించే చ‌ర్య‌లు చేపట్టారు.

2017లో 10 మంది విద్యార్ధులకు ఈ త‌ర‌హా స్కిల్స్, మోర‌ల్స్ చెబుతున్నారు. 2018 లో 30 మందిని ఎంపిక చేసారు. కేంద్ర,రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచీ దాదాపు 4 ల‌క్ష‌లు నిధులు తెప్పించిన ఎస్పీ…విద్యార్ధుల‌కు  పుస్త‌కాలతో విజ్ఙానం,కంప్యూట‌ర్ల‌తో సాంకేతిక ప‌రిజ్ఞానం క‌ల్పించేందుకు విద్యార్దుల చ‌దువుతున్న పాఠ‌శాలలో వాటిని అందించారు.

మొరాలిటీ,స్కిల్స్ ఈ  రెండు ల‌క్ష‌ణాల‌తో జిల్లాలో ఏర్పాటైన స్టూడెంట్ పోలీస్ కేడిట్ ఉన్న‌త పాఠ‌శాల విద్యార్దుల‌కు ఎంత‌గానో దోహ‌ద ప‌డుతున్న‌ది చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏఆర్ డీఎస్పీ శేషాద్రి నోడ‌ల్ ఆఫీస‌ర్ గా ఉంటున్న ఈ స్టూడెంట్ పోలీస్ కేడిట్…గ్రామీణ ప్రాంత విద్యార్ధుల‌ను ఉత్త‌మ పౌరులుగా తీర్చదిద్దేందుకు దోహ‌ద‌పడుతుంద‌న‌టంలో ఎటువంటి సందేహం లేద‌నే చెప్పాలి.

Related posts

మాదాసి కురువ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

వర్గీకరణకు మద్దతు ఇవ్వకుంటే బీజేపీకి అధోగతే

Bhavani

శాసనసభ్యుడు సైదిరెడ్డి ని సన్మానించిన గిరిజన నాయకులు

Satyam NEWS

Leave a Comment