27.7 C
Hyderabad
April 19, 2024 23: 48 PM
Slider విజయనగరం

దిశ యాప్ వినియోగం కోసం రంగంలో దిగిన ఎస్.హెచ్.ఓలు

#disha app

ఒక నెల ముందు వ‌ర‌కు  దిశ  విభాగంలో ప‌ని చేసిన‌ ఎస్పీ దీపికా పాటిల్  విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ దానిపై జిల్లా వ్యాప్తంగా అవగాహ‌న త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన నేర స‌మీక్షా స‌మావేశంలో ఇందుకు సంబందించి శాఖా సిబ్బందితో చ‌ర్చించారు కూడ‌.

ఈ నేప‌ధ్యంలో రాష్ట్ర డీజీపీ  ఆదేశాల మేర‌కు ఎస్పీ దీపికా పాటిల్ జిల్లా వ్యాప్తంగా సున్నిత‌మైన ప్రాంతాల‌లో సంబంధిత స్టేష‌న్ సిబ్బంది….దిశ యాప్ వినియోగం..దాని అవ‌స‌రం..యాప్ ను ఎలా ఉప‌యోగించాల‌ని..ఎస్ఓఎస్ బ‌ట‌న్ ను ఎలా నిర్వ‌హించాల‌న్న దానిపై సంబందిత స్టేష‌న్ హౌస్ ఆఫీసర్స్..ఎస్ఐలు అవ‌గాహ‌న చ‌ర్య‌లను చేప‌ట్టారు.

ఇందులో భాగంగా మొత్తం 34 పీఎస్ ల సిబ్బంది స్మార్ట్ ఫోన్ ల ద్వారా  ఆ దిశ యాప్ వినియోగంపై ముఖ్యంగా యువ‌త‌కు అందునా అమ్మాయిల‌ను వివ‌రించే య‌త్నం చేసారు. ఈ మేర‌కు విజయ‌న‌గ‌రం వ‌న్ టౌన్ ఎస్ఐ కృష్ణ కిఫోర్, బొండ‌ప‌ల్లి ఎస్ఐ వాసుదేవ్,టూటౌన్ ఎస్ఐ బాలాజీ గుర్ల ఎస్ఐ శిరీష,వ‌ల్లంపూడి ఎస్ఐ దేవీ , విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ ఎస్ఐ నారాయ‌ణ‌  ఇలా ఒక్కో స్టేష‌న్  నుంచీ ఆయా ఎస్ఐలు త‌మ‌,త‌మ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిల‌లో ఉన్న కాలేజీల‌కు వెళ్లి అమ్మాయిల‌కు దిశ యాప్ ఎలా ఉప‌యోగించాలి దాని వ‌లన ఉప‌యోగాల‌ను తెలియ చేసారు.

ఇప్ప‌టికే మ‌హిళా  సంర‌క్ష‌క పోలీసుల ద్వారా దిశ యాప్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న ఎస్పీ దీపికా పాటిల్.. లా అండ్ ఆర్డ‌ర్ సిబ్బంది తో కూడా అవ‌గాహ‌న క‌ల్పించే చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం అభినంద‌నీయ‌ని స‌త్యం న్యూస్.నెట్ అంటోంది.

Related posts

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

రాజపక్సే పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Satyam NEWS

అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుపై మంత్రి విమర్శ

Satyam NEWS

Leave a Comment