28.7 C
Hyderabad
April 17, 2024 05: 11 AM
Slider మహబూబ్ నగర్

వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను జయించవచ్చు

#MahaboobnagarSP

వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, సామాజిక దూరం పాటించడం వంటి చిన్న జాగ్రత్తలతోనే కరోనా అంటువ్యాధిని నిర్మూలించగలమని మహబూబ్ నగర్ జిల్లా జిల్లా ఎస్.పి. రెమా రాజేశ్వరి అన్నారు.  కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు తమకు తాము, కుటుంబానికి, సమాజానికి రక్షణ కల్పించే సైనికులుగా నిలవాలని ఎస్.పి. పిలుపునిచ్చారు.

పోలీసు శాఖకు చెందిన 55 వాహనాలను సానిటైజ్ చేసే కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్స్ లో ఈ ఉదయం ఎస్.పి. ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, శుభ్రత అనేది మన జీవితంలో తప్పనిసరి అలవాటు కావాలని మనం వాడే వస్తువులు, వాహనాలు ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేక రోగాలను దగ్గరకు రానివ్వదని గుర్తు చేశారు.

తమ పోలీసు శాఖకు చెందిన 55 వాహనాలను అత్యంత నాణ్యమైన రీతిలో సానిటైజ్ చేసేందుకు ఆటోమోటవిల్ అస్సాం సంస్థ ప్రతినిధి, స్థానిక కిరాణా మర్చంట్ అధ్యక్షుడు సంబు లక్ష్మణ్ ముందుకు రావడం సంతోషకరమని, పోలీసు కష్టాన్ని గుర్తించి అభినందిస్తున్న, సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతతో ఉంటామని ఈ సందర్భంగా ఎస్.పి. పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉన్నారని, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎవరికివారు క్రమశిక్షణతో మసలుకోవాలని ఎస్.పి. పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అదనపు ఎస్.పి. ఎన్. వెంకటేశ్వర్లు, డి.ఎస్.పి. సాయి మనోహర్, సంబు లక్ష్మణ్, సంబు రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రమశిక్షణ అనేది ఒక ముఖ్యమైన లక్షణమై ఉండాలి

Satyam NEWS

మెట్రో స్టేషన్ లో ఊహించని ప్రమాదం

Satyam NEWS

విజయనగరం లో సీనియర్ జర్నలిస్ట్ అంబటికి నివాళి….!

Satyam NEWS

Leave a Comment