40.2 C
Hyderabad
April 24, 2024 17: 24 PM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి పట్టణమంతా డ్రోన్ కెమెరా తో నిఘా

Drone Cam

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఒకరికి కో వైడ్ 19 పాజిటివ్ రావడంతో కరోనా వైరస్   నివారణలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో డ్రోన్ కెమెరా తో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్టు డి.ఎస్.పి గిరిబాబు తెలిపారు.

కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్ లో ఒక యువకుడికి కరుణ వైరస్ పాజిటివ్ రావడంతో బలరాం నగర్ ను  రెడ్ జోన్ గా ప్రకటించారు. లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి డి.ఎస్.పి గిరి బాబు  హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నగరవాసులు కరోనా ను కట్టడి చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రత్యేకంగా బలరాం నగర్ ప్రజలను ప్రత్యేకంగా వారు బయటకు రావద్దని ఏదైనా నిత్యవసర వస్తువులు పాలు పండ్లు కూరగాయలు ఇతర వస్తువులు అవసరమైతే మున్సిపల్ అధికారులు అందచేస్తారని అన్నారు.

మెడికల్ అవసరం అయితే 100 కు కాల్ చేయాలని, కచ్చితంగా అధికారులు స్పందించి తమ వాహనాల ద్వారా అందజేస్తారని తెలిపారు. కాబట్టి పట్టణ వాసులు అనవసరంగా బయటికి రాకూడదని వచ్చిన వారిపై కఠినమైన కేసులు పెడతామని హెచ్చరించారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ ధర్నా

Satyam NEWS

యాక్షన్ ప్లాన్: నిమ్స్ లో కరోనా వార్డు ఎలావుంది?

Satyam NEWS

పేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సహాయనిధి

Satyam NEWS

Leave a Comment