33.2 C
Hyderabad
April 26, 2024 02: 05 AM
Slider విజయనగరం

శాఖా సిబ్బంది సమస్యలకు “పోలీసు సంక్షేమ దినోత్సవం”:ఎస్పీ దీపికా

#depika

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా విపత్కర సమయంలోను, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి “పోలీసు సంక్షేమ దినోత్సవం” ను జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేసి, ఉద్యోగ విరమణ చేసిన, కరోనా విపత్కర సమయంలోను, రోడ్డు ప్రమాదాల్లోను, అనారోగ్య కారణాలతో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యుల పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా “పోలీసు సంక్షేమ దినోత్సవం” ను నిర్వహించామన్నారు.

ఉద్యోగ విరమణ తరువాత లేదా కోవిడ్ విపత్కర సమయంలో మృత్యువాత చెందిన పోలీసులు, రోడ్డు ప్రమాదాల్లోను, అనారోగ్య కారణాలతో మృతి చెందిన పోలీసుల కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమావేశానికి హాజరైన ప్రతీ ఒక్కరితోను జిల్లా ఎస్పీ మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇంకనూ పోలీసు కుటుంబాలకు, ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు రావాల్సిన రాయితీల గురించి, ప్రస్తుతం సదరు బిల్స్ ఏ స్థాయిలో ఎవరి వద్ద పెండింగులో ఉన్నవి అన్న విషయాలను జిల్లా పోలీసు కార్యాలయ ఉద్యోగులను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి ఇంతవరకు చేపట్టిన చర్యలను వారికి వివరించారు.

ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగుల సమస్యల్లో చాలా వరకు జీపీఎఫ్, జీఐఎస్, ఎపిజిఎఐ బకాయిలు, కారుణ్య నియామకాలకు తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీసు కార్యాలయ ఉద్యోగులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎంప్లాయిస్ హెల్త్ కార్డు మంజూరు చేయాల్సిందిగా ఉద్యోగ విరమణ చేసిన పోలీసులు జిల్లా ఎస్పీని కోరారు.

వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రధాన కార్యాలయంతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిపి, చర్యలు చేపడతామన్నారు. కరోనా విపత్కర సమయంలో విధి నిర్వహణలో మృతి చెందిన ఏడుగురు పోలీసు ఉద్యోగుల కుటుంబాలు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన మూడు పోలీసు కుటుంబాలు, సహజ మరణం చెందిన ఐదు పోలీసు కుటుంబాలు, 23మంది ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులు, ముగ్గురు మృతి చెందిన హెూంగార్డ్సు్ కుటుంబ సభ్యులు హాజరై, వారి సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొని వచ్చారు.

ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులకు, మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి ఎప్పుడైనా తీసుకొని రావచ్చునన్నారు. అదే విధంగా తనను కలిసేందుకు అవకాశం లేనివారు అదనపు ఎస్పీ లేదా వెల్ఫేర్ ఆడ్స్ లేదా పోలీసు అసోసియేషను దృష్టికి తీసుకొని రావచ్చునని, వాటి పరిష్కారానికి తప్పనిసరిగా చర్యలు చేపడతామన్న భరోసాను పోలీసు కుటుంబాల్లో జిల్లా ఎస్పీ కల్పించారు.

అదే విధంగా మృతి చెందిన పోలీసు కుటుంబాలకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనా, మరి ఏ ఇతర సమస్యలున్నా తనను నేరుగా కలవవచ్చునని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. ఈ పోలీసు సంక్షేమ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన పోలీసు కుటుంబాలకు, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు ఉద్యోగులకు పోలీసు కార్యాలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, దిశ డీఎస్పీ టి.త్రినాధ్, డీపీఓ ఎఓ వెంకట రమణ, సీఐలు బి.వెంకటరావు, ఎస్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, రుద్రశేఖర్, ఆర్ఐలు టీవీఆర్ కే కుమార్, పి. ఈశ్వరరావు, పి.నాగేశ్వరరావు, మరియరాజు, చిరంజీవి, డీపీఓ పర్యవేక్షకులు టి. భవానీ, ఎ.వి.ఎస్.ప్రభాకరరావు, పి.సూర్యకుమారి, టి. కామేశ్వరరావు, జూనియర్ సహాయకులు డి.శ్రీనివాసరావు, పోలీసు అసోసియేషను అడహక్ సభ్యులు కే.శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నాగావళి నదిలో ఇసుక దీక్ష కు సిద్ధం

Satyam NEWS

వరి పంట సాగు వద్దంటే రైతులు ఉరి వేసుకోవాలా?

Satyam NEWS

ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు విఫలం: యుద్ధం కొనసాగింపు

Satyam NEWS

Leave a Comment