27.7 C
Hyderabad
April 24, 2024 07: 17 AM
Slider విజయనగరం

ఏజెన్సీ ప్రాంతాల‌ ప‌రిధిలో మ‌ధ్యాహ్నం వ‌రకే పోలింగ్…?

#RajakumariIPS

ఈ నెల 8 విజ‌య‌న‌గ‌రం జిల్లా వ్యాప్తంగా అన్ని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఇప్ప‌టికే 74 తీవ్ర ప్ర‌భావిత ప్రాంతాల‌లో ఎన్నిక‌లు అత్యంత ప‌క‌డ్బందీగా నిర్వ‌హిస్తున్న‌ట్టు ఎస్పీ తెలిపారు. ఈ నేప‌ధ్యంలో 12 పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలుల‌లో పోలింగ్ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కే ముగుస్తుంద‌ని ఎస్పీ తెలిపారు.

ఏయే పోలీస్ స్టేష‌న్ ప‌రిధిల‌లోనంటే…. ఎల్విన్ పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని లుంబేసు, తాడికొండ‌, పెద‌ఖ‌ర్జ‌, రెల్ల‌, నొండ్రుకోన‌, వంగ‌ర‌, చెముడుగూడ‌,  నెల్లికిక్కువ‌, దుడ్డుఖ‌ల్లు, బాలేశు, ఒన‌కాబ‌డి, ఆర్‌.జ‌మ్ము, సిహెచ్‌.బిన్నిడి, బీరుపాడు, జ‌ర్న‌, చిన‌గీస‌డ‌, గొయిపాక పోలింగ్ స్టేష‌న్ల ప‌రిధిలోను. అలాగే జియ్య‌మ్మ‌వ‌ల‌స పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని కొండ‌చిల‌కాం, టి,కె.జ‌మ్ము,

పెద‌తోలుమండ పోలింగ్ స్టేష‌న్ల ప‌రిధిలో. ఇక కొమ‌రాడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని చోళ‌ప‌దం, ఉలిపిరి, యండ‌భ‌ద్ర‌, పెద‌సేఖ‌,  మ‌సిమండ‌, చిన‌కేర్జ‌ల‌, పెద‌కేర్జ‌ల‌, న‌య‌, గుణ‌త‌తీలేశు, కెమిశీల పోలింగ్ కేంద్రాల ప‌రిధిలో.అదే  విధంగా  కురుపాం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బియ్యాల‌వ‌ల‌స‌, గుడ్డిగూడ‌, పోడి, గొటివాడ‌, ర‌స్త‌కుంటుబాయి, ఏగుల‌వాడ‌, గుమ్మ పోలింగు కేంద్రాల ప‌రిధిలో పోలింగ్ మ‌ధ్యాహ్నం 3  గంట‌ల‌కే ముగుస్తంది.

ఇక నీల‌కంఠాపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని జి.శివ‌డ‌, గుజ్జ‌వాయి, తిత్తిరి(టొంప‌ల‌పాడు), జ‌ర‌డ‌, వొబ్బంగి, ఊస‌కొండ పోలింగు కేంద్రాల ప‌రిధి, మ‌క్కువ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని నంద‌, ప‌న‌సభ‌ద్ర పోలింగ్ కేంద్రాల ప‌రిధి,అలాగే ఆండ్ర పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఆండ్ర‌, లోతుగెడ్డ‌, కొండ‌లింగాల వ‌ల‌స‌(1,2), కూనేరు పోలింగు కేంద్రాల ప‌రిధిలో..అదే విధంగా పాచిపెంట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రొడ్డ‌వ‌ల‌స‌(ఆజూరు), ఆలూరు(మోదుగ‌), క‌టారికోట‌(గుమ్మిడిగూడ‌), కేరంగి, మిలియ‌కంచేరు, తుమ‌రావ‌ల్లి, బోర‌మామిడి, క‌న్న‌య్య‌వ‌ల‌స‌(గుట్టూరు), చిట్టెల‌బ‌, గ‌రిసిగుడ్డి,

సెతాబి పోలింగు కేంద్రాల ప‌రిధిలో పోలింగ్ మ‌ధ్యాహ్నంతోటే ముగుస్తుంది. అదే విధంగా పార్వతీపురం(రూర‌ల్‌) పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని సంగంవ‌ల‌స‌, ముల‌గ‌, డోకిశీల‌, గోచెక్క‌, బురుదువాడ పోలింగు కేంద్రాల ప‌రిధిలో సాలూరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని నార్ల‌వ‌ల‌స‌, తోణాం, కొద‌మ‌, గంజాయిభ‌ద్ర‌, సారిక‌, దెంస‌రాయి, కురుకుట్టి-1,2 పోలింగు కేంద్రాల ప‌రిధిలో గంట్యాడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని దిగువ కొండ‌ప‌ర్తి(అడ్డ‌తీగ‌) పోలింగు కేంద్రాల ప‌రిధిలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కే పోలింగ్ జ‌రుగుతుంద‌ని ఎస్పీ రాజ‌కుమారీ తెలిపారు

Related posts

`హ‌ర్లా ఫర్లా` సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్నహీరో

Sub Editor

కన్నుల పండువగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

కరోనా నిర్మూలనలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయం

Satyam NEWS

Leave a Comment