28.7 C
Hyderabad
April 24, 2024 05: 06 AM
Slider సంపాదకీయం

Long journey: ఇటు చంద్రబాబు అటు కేసీఆర్

#chandrababu

జాతీయ పార్టీ పెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి అక్కడి తన పాత మిత్రులైన తెలుగుదేశం పార్టీ వారికి ఆహ్వానం పలుకుదాం అనుకుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఒక్క సారిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

తనతో కలిసి పని చేసిన తెలంగాణ నాయకులు మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని చంద్రబాబునాయుడు పిలుపునివ్వడం తో బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ లో చర్చనీయాంశం అయింది. టీఆర్ఎస్ పార్టీ లో దాదాపు 60 శాతం మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే ఉన్నారు. మంత్రి పదవుల నుంచి ఇతర అన్ని పదవుల వరకూ మాజీ తెలుగు తమ్ముళ్లే హవా నడిపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి కేటీఆర్ నేతృత్వం వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆంధ్రాలో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు పెద్ద ప్లాన్ వేసుకున్నారు. ఆంధ్రాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడ పార్టీని బలోపేతం చేయాలని భావించారు. ఆంధ్రాలో బహిరంగ సభ ఏర్పాటు చేసే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు అప్పగించారు.

ఆంధ్రాలో బీఆర్ఎస్ ఎప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. సంక్రాంతి నాటికి అది కార్యరూపం దాల్చాలని భావిస్తున్నారు. ఏపిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఆకర్షించాలనేది కేసీఆర్ వ్యూహం. టీడీపి వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం ద్వారా రెండు ప్రయోజనాలను సాధించవచ్చుననేది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

ఒకటి: తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం ద్వారా తన సన్నిహితుడైన జగన్ కు రాజకీయ లబ్ది చేకూర్చుకోవడం రెండు: బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా విస్తరించుకోవడం. ఈ రెండు లక్ష్యాలను ఒకే దెబ్బతో సాధించాలని కేసీఆర్ ప్లాన్ వేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఊహించని విధంగా చంద్రబాబునాయుడు తెలంగాణ పై తన దృష్టిని సారించారు.

పార్టీ అధ్యక్షుడిని మార్చుకుని పార్టీ కార్యక్రమాలను తెలుగుదేశం నాయకులు విస్తృతం చేశారు. తొలిగా ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ఊహించని విధంగా జనం వచ్చారు. చంద్రబాబు ప్రసంగానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబునాయుడు ఎక్కడా కేసీఆర్ పేరుగానీ, బీఆర్ఎస్ పేరుగానీ ప్రస్తావించలేదు. కేవలం తాను చేసిన పని మాత్రమే చెప్పారు.

అయినా సరే బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబునాయుడి బహిరంగ సభ తర్వాత విపరీతంగా విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు తన సభలో మాజీ తెలుగుదేశం వారు తిరిగి రావాల్సిందిగా కోరారు. దీనికి ఎంత వరకూ స్పందన వస్తుందో తెలియదు కానీ బీఆర్ఎస్ నాయకుల కంగారు చూస్తూ పెద్ద ఎత్తున వలసలు ఉంటాయా అనే అనుమానం కలుగుతున్నది.

తెలంగాణ లో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది. నాయకత్వం తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల కారణంగా కొంత నష్టం జరిగినా కూడా తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే బీఆర్ఎస్ నేతలు అంత తీవ్రంగా స్పందించారని అంటున్నారు. కేసీఆర్ ఆంధ్రా వెళ్లే సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం తెలంగాణ లో తిష్ట వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

Related posts

అత్యాచారం, హత్య కేసు చేధించిన మెదక్ పోలీసులు

Satyam NEWS

మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నకర్రి బాలాజీ “బ్యాక్ డోర్”

Sub Editor

గ్రామాలలో కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలి

Satyam NEWS

Leave a Comment