37.2 C
Hyderabad
March 29, 2024 20: 10 PM
Slider విజయనగరం

నీలాచలం కొండ వద్ద స్పృహ తప్పిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

#RamateerdhamBJP

విజయనగరం జిల్లా రామతీర్థం నీలాచలం కొండవద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొండపై రాముని విగ్రహ ఖండనపై అటు బీజేపీ, ఇటు టీడీపీ ఆందోళన కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో నే ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారన్న సమాచారం తెలియగా ఆఘమేఘాల మీద…అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నీలాచలం కొండపై ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 అప్పటికే కొండ దిగువన టీడీపీ, బీజేపీ లు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు కొనసాగించారు.ఆ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ, బీజేపీ లు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి… కొండ మెట్ల వద్ద బైఠాయించారు. అయితే ఆ సమయంలో పార్టీ కార్యకర్తల మధ్య తోపులాటలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయారు.

వెనువెంటనే బీజేపీ నేతలు…పోలీసు జులుం నశించాలి అంటూ నినాదాలు చేసారు. ఈ తోపులాటను తగ్గించేందుకు వన్ టౌన్ సీఐ కిరణ్ ,భోగాపురం సీఐ శ్రీధర్, బొబ్బిలి రూరల్ సీఐ శోభన్ బాబు శ్రమపడ్డారు.

దాదాపు గంటకు పైగా కొండ దిగవన నిరసనలతో దద్దరిల్లింది.

అయితే అంతలోనే ప్రతిపక్ష నేత బాబు వస్తున్నారను..నిరసనలు తగ్గించాలని పోలీసులు కోరడంతో మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు.

అనంతరం అధికార పార్టీ ఎమ్మెల్యే లంతా దిగువన దేవస్థానం దేవాలయం లో రాముని దర్శించుకుని అక్కడ నుంచి విజయనగరానికి వెళ్లారు.

ఈ క్రమంలో నే ప్రతిపక్ష నేత బాబు తన  కాన్వాయ్ తో కొండ దిగువ న కాస్పేపు ఉండిపోయారు.ఈ క్రమంలో నే ఆ రోడ్డంతా వాహనాలతో నిండి ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఓ వైపు అధికార పార్టీ వాహనాలు మరో వైపు ప్రతిపక్ష  పార్టీ నేతల వాహనాలతో పూర్తి స్తంభించిపోయింది. దీంతో 12.15 రావలసిన బాబు రెండు గంటల కు రామతీర్థం చేరుకొన్నారు. ఏదైనా రామతీర్థం… అధికార ప్రతిపక్ష పార్టీల నిరసనలతో దద్దరిల్లిపోయింది.

పర్వసనంగా రామతీర్థం అంశం కాస్త….రాష్ట్రంతో పాటు జాతీయ అంశంగా మారిందనే చెప్పాలి.

Related posts

గ్రేట్ తెలంగాణ: నడి ఎండలోనూ దుంకుతున్న నీళ్లు

Satyam NEWS

దేవుని దర్శనాల పేరుతో ఎమ్మెల్యేల దోపిడీ

Satyam NEWS

సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో లయన్స్ సేవలు అద్వితీయం

Satyam NEWS

Leave a Comment