37.2 C
Hyderabad
March 28, 2024 18: 56 PM
Slider విశాఖపట్నం

కాంట్రవర్సీ: సింహాచలంలో రాజకీయ నిర్ణయాలు

#SimhachalamDevasthanam

మత విశ్వాసాలపై నమ్మకం లేని వాళ్లు దేవస్థానాలకు చైర్మన్ లు గా వస్తుంటే పెదవి విప్పని అధికారులు దేవస్థానంలో స్వామి, దేవేరుల సేవలు చేసుకునే వారిపై మాత్రం ఒంటికాలిపై లేస్తున్నారు. నిన్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన ఒక సంఘటనే ఇందుకు నిదర్శనం. స్వామివారి చందనోత్సవ కార్యక్రమం సందర్భంగా ఒక ప్రయివేటు వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడనే కారణంతో ఏకంగా ఆలయ ఇంచార్జి ప్రధాన అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యులు ను సస్పెండ్ చేశారు.

ఆ సంఘటనతో తనకు సంబంధం లేదని చెబుతున్నా ఆయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు. తిరుపతి శ్రీను అనే ప్రైవేటు వ్యక్తి దేవస్థానానికి పాలు తీసుకు రావడానికి కొండ పైకి వచ్చాడు. అయితే అతనికి దేవాలయంలో అనుమతించలేదు. అయితే తిరుపతి శ్రీను ఆ తర్వాత ఆలయంలోకి వచ్చినట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.

దీనికి కారణం ఆలయ ఇంచార్జి ప్రధాన అర్చకుడు గొడవర్తి కృష్ణ మతాచార్యులు అని ఈవో వెంకటేశ్వరరావు ఏకపక్షంగా నిర్ధారించారు. వెనువెంటనే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనను రాజకీయం చేసి ఈ కేసులో ఇరికించారని సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలక్రిష్ణమచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

రైస్ మిల్లు కార్మిక కుటుంబాలకు యాజమాన్యం అండగా నిలవాలి

Satyam NEWS

మద్దతు ధర కోసం పసుపు రైతుల కలెక్టరేట్ ముట్టడి 5న

Satyam NEWS

రెబెల్ వాయిస్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుపైనే అభ్యంతరం

Satyam NEWS

Leave a Comment