39.2 C
Hyderabad
April 25, 2024 16: 59 PM
Slider ముఖ్యంశాలు

నేతల సెటిల్ మెంట్స్ – బంధువుల భూ పంచాయతీలు

#LandDispute

హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. ఓ భూవివాదం  విషయంలో తలెత్తిన గొడవలే ఈ కిడ్నాప్ కు ప్రధాన కారణమన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నగరంలో భూములకు రెక్కలు రావడంతో అందరికన్ను భూములపైనే పడింది.

గతంలోనూ భూ పంచాయతీలకు సంబంధించి చాలా గోడవలే జరిగాయి. నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన, జరుగుతున్న ఘటనలు కూడా అందులో భాగమే. అయితే ఈవిషయంలో ఇరువురు కూడా రాజకీయ ప్రముఖులు, వారి దగ్గరి బంధువులే ఉండండంతో ఈ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.

శేరిలింగంపల్లి మండల పరిధిలో వందల ఎకరాల సర్కార్ స్థలాలు ఉన్నాయి. అందులో హఫీజ్ పేట్ భూములు కూడా ఉన్నాయి. ఇప్పటికే వీటిలో చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. ఉన్న భూములపై పదుల సంఖ్యలో కేసులున్నాయి.

 కబ్జాలో ఉన్నవారు, మావంటే మావంటూ తరుచూ గొడవలు జరగడం పడడం, పోలీసులను, కోర్టులను ఆశ్రయించడం కామన్ గా మారింది. మరీ శృతిమించితే కిడ్నాప్ లు, అంతకుమించిన ఘటనలు చోటుచేసుకుంటాయి. అందులో ఈ కిడ్నాప్ వ్యవహారం ఒకటి.

చాలామట్టుకు ఈ తరహా పంచాయతీలు పొలిటీషియన్స్ దగ్గరకు వెళుతుంటాయి. మ్యాక్జిమం వారే సెటిల్ చేస్తుంటారు. ఈ హఫీజ్ పేట్ సర్వే నెంబర్ 80లో సుమారు 500 ఎకరాల భూములున్నాయి. ఇవన్నీ నిజం ల్యాండ్స్.  వీటిపై చాలా రోజులుగా ప్రభుత్వం, నవాబుల వారసులు కోర్టుచుట్టూ తిరుగుతున్నారు.

వీటిని నవాబుల భూములుగా కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది.  ఇదే సెటిల్ మెంట్ విషయంలో గొడవలు, కిడ్నాప్ లు జరిగినట్లు సమాచారం. దీంతో కేపీహెచ్ బీ కాలనీలోని లోదా బెలేజాలో నివసిస్తున్న మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియా, ఆమె భర్తతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.

వారిని ముందుగా బోయిన్ పల్లి పీఎస్ కు తరలించిన పోలీసులు అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుండి సీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related posts

వినూత్నంగా బతుకమ్మ వేడుకలు

Satyam NEWS

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

Satyam NEWS

దేశమంటే మట్టికాదోయ్…దేశమంటే మనుషులోయ్..

Satyam NEWS

Leave a Comment