30.7 C
Hyderabad
April 17, 2024 01: 10 AM
Slider పశ్చిమగోదావరి

రజకుల చెరువుపై రాజకీయం: కోర్టు ఆదేశాలతో వేలం

#Rajakula pond

ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెడకడిమి గ్రామంలో గత కొంత కాలం గా కోర్టు వివాదం లో ఉన్న రావుల చెరువు వేలం పాటకు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ స్థాయి లో ఏర్పడిన కమిటీ ఆధ్వర్యం లో ఫిబ్రవరి 9 వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్టు డి ఎల్ పి ఓ అన్నామణి శనివారం తెలిపారు.

అయితే రావుల చెరువు ను గతంలో  పెదకడిమి రజకులకు కులవృత్తి చేయడానికి కేటాయించినట్టు సమాచారం. 1978 లో ప్రభుత్వం కూడా ప్రతి గ్రామం లో రజకుల కు ప్రత్యేకంగా ఒక చెరువును కేటాయించాలని నిర్ణయిస్తూ 343 జి ఓ ను కూడా ఇచ్చినట్టు తెలిసింది. వృత్తి పరంగా రజకులు 20 ఏళ్లకు పై గా రావుల చెరువులో బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందడం గ్రామస్తులకు కూడా తెలుసు. 

అప్పట్లో  అధికారం లో ఉన్న ప్రభుత్వం  రజకుల ఆధీనం లో రావుల చెరువు కు అతి తక్కువ ఆదాయం వస్తోందని భావించి  రావుల చెరువు లో రజకుల ను తప్పించి పంచాయతీ ఆదాయం పెంచడానికి చేపల పెంపకానికి చెరువుకు పాట పెట్టారనేది సమాచారం.

వై సి పి అధికారం లోకొచ్చేముందు పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలనలో  రావుల చెరువును తిరిగి రజకులకు అప్పగించినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆ గ్రామ పంచాయతీ రావు ల చెరువు ను స్పెషలాపీసర్ లు రజకుల కు కేటాయిస్తూ చేసిన పంచాయతీ తీర్మానం తప్పని  కొత్త గా ఎన్నికైన పంచాయతీ బోర్డ్ రావుల చెరువు గతం లో రజకులకు కేటాయించిన విషయం చెప్పకుండా  1978 లో ప్రభుత్వం రజకులకు  ఇచ్చిన 343 జి ఓ ని కోర్ట్ కు తెలుపకుండా కప్పి పుచ్చినట్టు తెలిసింది. 

అప్పటి స్పెషలాఫీసర్ లు  చేసిన  తీర్మానం చెల్లదని హై కోర్ట్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు పంపినట్టు సమాచారం. సదరు హై  కోర్ట్ రావుల చెరువు కు పాట పెట్టాలనే కోర్ట్ ఆదేశాలను అమలు పరచలేక రాజకీయ వత్తిడులు తట్టుకోలేక  జిల్లా అధికారులు, పెదవేగి మండల అధికారులు మానసిక వత్తిడులకు గురైనట్టు తెలిసింది.

కోర్ట్ ఆదేశాల ధిక్కరణ కింద అధికారులపై చర్యలు చేపట్టే పరిస్థితి ఏర్పడటం తో జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో ఆర్ డి ఓ.  డి పి ఓ.   డి ఎల్ పి ఓ.  .ఎం డి ఓ.  ఈ ఓ పి ఆర్ డి .  పంచాయతీ కార్యదర్శి తో ఉన్నత స్థాయి కమిటీ గా ఏర్పడి కోర్ట్ ఆదేశాలను గౌరవిస్తూ అధికారులు 9/2/2023వ తేదీన పెడకడిమి లో రావుల చెరువుకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నారు.

9వతేదీన ఉదయం 10 గంటలకు పెడకడిమి లో రావుల చెరువు కు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు డి ఎల్ పి ఓ చెప్పారు. ఇటీవల   డి పి ఓ మల్లిఖార్జునరావు  కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు రావుల చెరువు వేలం వేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.

Related posts

ఆరోగ్య సిబ్బందిని వేధిస్తున్నపిహెచ్ సి డాక్టర్

Satyam NEWS

విజయసాయిరెడ్డిపై 100 కోట్ల పరువు నష్టం దావా

Satyam NEWS

దోచుకోవడం,దాచుకోవడమే కల్వకుంట్ల కుటుంబ ప్రత్యేకత

Bhavani

Leave a Comment