రాజకీయం అంటే “రాక్షస జనానికి కీడు చేసే యంత్రాంగం” అప్పుడెప్పుడో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ గా పుండరీకాక్షయ్య విలన్ గాఉంటూ రాజకీయానికి పైన చెప్పిన అర్ధం వ్యంగంగా చెప్పారు.మరి ఇప్పుడెందుకు “సత్యం న్యూస్.నెట్ “కోటేషన్ చేసిందంటే, విజయనగరం పాత బస్టాండ్ వద్ద ఉన్న రాజీవ్ క్రీడామైదానంలో డీఎస్పీఓ,విభిన్న ప్రతిభావంతుల శాఖ సంయుక్తంగా క్రీడా పోటీలను నిర్వహించింది.
అందుకు ఇండోర్ స్టేడియంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల పోటోలను ముద్రించి,కటౌట్ల రూపంలో అమర్చింది కూడా.ఈ ఫోటోలలో ఎమ్మెల్యేలు,ఎంపీతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్,తో పాటు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఫోటో కూడా పెట్టారు.ప్రొటో కాల్ ప్రకారం ఇంతవరకు ఒకే.కానీ ఎమ్మెల్యే,ఎంపీలతో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు,వీఎంసీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మిల ఫోటోలను పసుపు రంగుం అమర్చి ,అదీ రాజీవ్ స్పోర్ట్స్ మైదానం అందునా ఇండోర్ స్టేడియంలో పెట్టడంతో “రాజీవ్ స్పోర్స్ మైదానంలో పెట్టిన ఫోటోలలో రాజకీయం” అని అంటోంది “సత్యం న్యూస్.నెట్”