25.2 C
Hyderabad
January 21, 2025 12: 02 PM
Slider రంగారెడ్డి

పోలీస్ సేవలపై క్యూ‌ఆర్ కోడ్ తో అభిప్రాయ సేకరణ

#VikarabadPolice

తెలంగాణ రాష్ట్ర డిజిపి డా.జితేందర్ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయము తెలుసుకోవడానికి నూతనంగా విడుదల చేసిన క్యూఆర్ కోడ్  పోస్టర్ (సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్)ను వినియోగించుకొని జిల్లా ప్రజలు పోలీస్ సేవల పైన తమ అభిప్రాయాలను తెలియజేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ క్యూ‌ఆర్ కోడ్ పోస్టర్ లను జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాల్లో, డి.ఎస్పి ఆఫీసులో, ఎస్‌పి ఆఫీసులో  మరియు సోషల్ మీడియా నందు అందుబాటులో ఉంటాయని వివరించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్యూ‌ఆర్ కోడ్ పైన స్కాన్ చేసి వచ్చిన లింక్ ను తెరచి తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన సూచించారు.

Related posts

బీజేపీ నుంచి యెన్నం సస్పెండ్

mamatha

రాజంపేట అన్నమయ్య జిల్లా కోసం రిలే నిరాహార దీక్ష

Satyam NEWS

8వ తేదీన హైదరాబాద్ కు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ

Satyam NEWS

Leave a Comment