అయిన వాళ్లకు ఆకుల్లో… కాని వారికి కంచాల్లో అన్న సామెతను గత వైసీపీ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించింది. అంతేనా… జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కండబలం చూపి కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ లను తన అనుయాయులకు రాయించేసుకుంటే.. జగన్ బినామీలు, భారతి రెడ్డి బినామీలు ఏ రితిన ఆస్తులను తమ పేరిట రాయించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా వైసీపీ జమానాలో అదనపు అడ్వొకేట్ జనరల్ గా పనిచేసిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుదాకర్ రెడ్డి కుటుంబం కూడా తమదైన శైలిలో ప్రబుత్వ యంత్రాంగానికి వినియోగించుకుని అందిన కాడికి దండుకుంది.
తాజాగా వెలుగు చూసిన ఈ దందాలో సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి తనదైన శైలి చక్రం తిప్పి… అటు శ్రీకాకుళం జిల్లాతో పాటుగా ఇటు అన్నమయ్య జిల్లాలోనూ గనులను చేజిక్కించుకున్నారు. ఈ వ్యవహారాల్లో కార్తీక్ రెడ్డికి నాటి గనుల శాఖ డైరెక్టర్ హోదాలో వీజీ వెంకటరెడ్డి ఏ రీతిన సాగిలపడ్డారన్న విషయమూ బయటపడింది. సుధాకర్ రెడ్డి సాదాసీదా లాయర్ గా కొనసాగుతున్నంత సేపూ కార్తీక్ రెడ్డి అనాకుడిగానే ఉండిపోయాడు. అయితే ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చి…తన తండ్రికి ఏకంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పదవి దక్కిందో… అతడిలోని అసలు సిసలు వ్యక్తి మేల్కొన్నాడని చెప్పాలి.
కలర్ గ్రానైట్ క్వారీలను దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన కార్తీక్ రెడ్డి…శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం సొంటినూరులో 4.9 హెక్లార్లలోని గనుల కోసం టెక్కలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేసుకున్నారు. పొన్నవోలు కుమారుడు కావడంతో టెక్కని గనుల శాఖ ఏడీ ఆఘమేఘాలపై సదరు దరఖాస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన పై అధికారికి పంపారు. ఆ తర్వాత సదరు ఫైల్ ఎక్కడా ఆగలేదట. నేరుగా గనుల శాఖ సంచాలకుడిగా ఉన్న వెంకటరెడ్డి తన వద్దకు రాగానే సదరు దరఖాస్తుకు ఆమోద ముద్ర వేస్తూ… 2 హెక్లార్టలో కలర్ గ్రానైట్ ను కార్తీక్ రెడ్డికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది.
ఈ గనుల కోసం ఇప్పటికే 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 200మందికి ఏడీ కార్యాలయం అనుమతులు ఇవ్వొచ్చంటూ తన అభిప్రాయాన్ని కూడా తెలిపింది. అయితే వారందరి కంటే ఆలస్యంగా వచ్చిన కార్తీక్ రెడ్డికి గనులు కేటాయంచిన జగన్ సర్కారు… మిగలిన వారికి మొండిచేయి చూపించింది. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లి ఏడీ కార్యాలయం పరిధిలోనూ ఇదే తంతు నడిచింది. మదనపల్లి పరిధిలోని బండకిందపల్లిలో 2 హెక్టార్లలో కలర్ గ్రానట్ గనులను కేటాయించాలంటూ కార్తిక్ రెడ్డి అలా దరఖాస్తు చేసుకోగానే ఇలా ఆయనకు గనులను కేటాయించారు.
ఈ సందర్భంగా అప్పటికే అమలులో ఉన్న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్దతిని పక్కనపెట్టేసిన అదికారులు… కార్తిక్ కంటే ముందు వచ్చిన ఓ మహిళ దరఖాస్తును పక్కనపెట్టేసి మరీ తమ స్వామి భక్తిని చాటుకున్నారు. ఇలా కార్తీక్ రెడ్డికి గనుల కేటాయింపులో నాటి ప్రభుత్వం ఎంతలా కదిలిందంటే… ఏళ్లు పట్టే అనుమతులను రోజుల వ్యవధిలో జారీ చేసి పారేసింది. ఇలా కార్తీక్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా అధికార యంత్రాంగం ఆయన దరఖాస్తులను పరుగులు పెట్టించింది.
ఈ సందర్భంగా నిబంధనలను అధికారులు తుంగలో తొక్కేశారు. అంతేగా మరి… తమ వారి కోసం నిబందనలను తుంగలో తొక్కని అదికారులను వైసీపీ నేతలు ఈజీగా వదలరు కదా. వెరసి వసీపీ జమానాలో చేతివాటం ప్రదర్వించిన చాలా మంది నేతల జాబితాలో ఇప్పుడు పొన్నవోలు కుటుంబం కూడా చేరిపోయిందన్న మాట.