27.7 C
Hyderabad
April 26, 2024 03: 32 AM
Slider కరీంనగర్

పేదలు ఆర్థికంగా బలపడేలా అభివృద్ది పథకాలు

#gangula

బలహీనులు బలవంతుడు చేతిలో దోపిడీకి గురికా వద్దని డాక్టర్  బి.ఆర్. అంబేద్కర్ రాజ్యంగంలో ఆర్టికల్ 3 చేర్చారని, బలహీనులు బలవంతులుగా మారాలానే ధ్యేయంతో  రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసంఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ రూరల్, అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 113 మంది లబ్ధిదారులు ఒక్కోక్కరికి రూ. 1,00,116 చెక్కులను మరియు కరీంనగర్ అర్బన్ బిసి వర్గానికి చెందిన వికలాంగురాలుకు రూ. 125145 విలువగల కళ్యాణలక్ష్మీ చెక్కులను మొత్తం 114 మంది లబ్దిదారులకు 1,14,38,253 విలువగల చెక్కులను  మంత్రి  పంపిణి చేశారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగంలోని  ఆర్టికర్ 3 లో సూచించిన మేరకు బలహీనులకు చట్టపరంగా  హక్కులు కల్పించాలని తెలిపారని పేర్కోన్నారు. బలహీనులు బలవంతుడి చేతిలో దోపిడీ గురుకువద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ను చేర్చారు అన్నారు. అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలవాలని నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి  అంబేద్కర్ పేరు నిర్ణయించామన్నారు

సమైక్య పాలనలో తెలంగాణకు న్యాయం జరగలేదని, సమైక్య పాలనలో కరెంటు నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉండేవని అన్నారు. కరెంటు లేక రైతులు పొలాల వద్ద పడి కాపులు కాసిన రోజులు గడిపామని,  గత పాలకులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనే మనస్సు రాలేదన్నారు.   తెలంగాణలో అద్భుతంగా నిర్మించుకుంటున్న రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేరును  పెట్టాలని సూచించిన  రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కృతజ్ఞతలను తెలియజేశారు.  

పోలాల్లో  కరెంటు కోసం  రైతులు ఎదురు చూ సే పరిస్థీతులు తెలంగాణ ఆవిర్బావానికి పూర్వం ఉండేదని, ప్రస్తుతం రెప్పపాటు కరెంటు కోతలు లేకుండా కరెంటు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కరోనాతో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికి పేద, బీద వర్గాలకు ఎప్పుడు సంక్షేమ పథకాలను అమలులో ఆలస్యం జరగనివ్వలేదని తెలిపారు.  75 సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో మునుపెన్నడు చూడని విధంగా తెలంగాణలో అభివృద్దిని సాధించడం జరిగిందని అన్నారు. 

పేద, బీద వాళ్లు ఆడపిల్ల పెళ్లి భారంగా భావించకుండా వారి ఇళ్లలో కుటుంబ పెద్ద గా మారి  కళ్యాణ లక్ష్మి, షాధిముబారక్ పథకం ద్వారా 1లక్షా 16వేలు అందజెస్తున్నాడని, ఆ బిడ్డ తొలిచూరు కాన్పు వస్తే కేసిఆర్ కిట్ పథకాన్ని అందించడం మాత్రమే కాకుండా పుట్టిన ఆ బిడ్డ గోప్పగా చదువుకునేలా గురుకులాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కోన్నారు.  మానేరు ఎండిపోతే నీటి కష్టాలు ఎవరు ఎదుర్కోకుండా  కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఎండకాలంలో కూడా మత్తడులు దూకే స్థితిలో నీరు ఉందని తెలిపారు. 

రైతులకు ఎప్పుడు అండగా ఉంటు  పథకం కింద ఎకరానికి 5000 వ్యవసాయ పెట్టుబడి సహాయాన్ని అందించడంతో పాటు ఎదైన కారణంతో  రైతు చనిపోతే వారికి కుటుంబానికి రైతుభీమా కూడా అందించడం జరుగుతుంది అన్నారు.   మన అభివృద్దిని కాంక్షిస్తన్న  మనసున్న ఎకైక వ్యక్తి కేసిఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో  నగర మేయర్ వై. సునీల్ రావు, కొత్తపళ్లి మున్సిపల్  చైర్మన్ రుద్రరాజు  ఎంపీపీ లక్ష్మయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి మధు, కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు  కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి తహసీల్దార్లు సుధాకర్ వెంకటరెడ్డి శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు

Related posts

చంద్రబాబు కుటుంబాన్ని అవమానించడంతోనే వైసీపీ పతనం ప్రారంభం

Satyam NEWS

రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో భద్రత కొరత

Satyam NEWS

ఘనంగా తెలంగాణా స్పీకర్ పోచారం జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment