30.3 C
Hyderabad
March 15, 2025 09: 18 AM
Slider నల్గొండ

నిరుపేద ఆర్యవైశ్యులకు ఆపన్నహస్తం అందించిన దాతలు

#Telugu Arya Vysya

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, పట్టణ వర్తక సంఘం, అవోపా వారి ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్యుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందచేశారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం లో జరిగిన ఈ కార్యక్రమంలో వంద మంది  నిరుపేద ఆర్యవైశ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1500 రూపాయల విలువ చేసే 25 కేజీల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక మున్సిపల్ చైర్మన్  గెల్లి అర్చన రవి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం లో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని  తెలుసుకొని ఆర్యవైశ్య సంఘం పెద్దలు అందరు కలిసి రూ. 1,50,000 చందా రూపంలో వసూలు చేసి వంద మంది నిరుపేద ఆర్యవైశ్యుల ను గుర్తించి వారికి సాయం చేశారు.

దాస నాగేశ్వరావు ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హుజూర్ నగర్ పట్టణం ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి నరసింహారావు , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు  గజ్జి ప్రభాకర్ , గెల్లి అప్పారావు, కుక్కడపు రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఇంకా  బచ్చు రామారావు, ఓరుగంటి మట్టయ్య ,  మున్సిపల్ కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, వీర్ల పాటి గాయత్రి భాస్కర్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఈసీ మెంబర్ మా శెట్టి అనంత రాములు, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు  జూలకంటి వాణి,  గుండా సుశీల, అవోపా కోశాధికారి రామారావు, కామిశెట్టి నందయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే.. ప్రజలను హెచ్చరించిన కమిషనర్

Satyam NEWS

అసలు జీ జెన్ పింగ్ కు ఏం జరిగింది?

Satyam NEWS

ఏ మాత్రం రక్షణ లేని భయంకర ప్రయాణం ఇది

Satyam NEWS

Leave a Comment