37.2 C
Hyderabad
March 28, 2024 19: 56 PM
Slider ముఖ్యంశాలు

త‌ప్పుడు కేసుల‌తో జైళ్ల‌లో మ‌గ్గిపోతున్న నిరుపేద‌లు..

#RTI act

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆర్టీఐ దరఖాస్తుతో బట్టబయలు

వంద‌మంది దోషులు త‌ప్పించుకున్న ఫ‌ర్వాలేదు కాని ఒక నిర్ధోషికి శిక్ష ప‌డొద్ద‌నేది మ‌న చ‌ట్టం చెప్పే ప్రాథ‌మిక సూత్రం.. కాని ఆ సూత్రం చెప్ప‌డానికి మాత్ర‌మే ప‌నిచేస్తోంది.. నేడు త‌ప్పుడు కేసుల‌తో ఎంతోమంది నిరుపేద‌లు జైళ్ల‌లో మ‌గ్గిపోతూ వారి జీవితాన్ని ఆ చెర‌సాల‌కే బందీని చేస్తున్నారు.. చిన్న చిన్న కేసులకే శిక్ష‌లు ప‌డి క‌నీసం బెయిల్ ఇచ్చే వారు లేక వారి జీవితాన్ని జైళ్ల‌లోనే ముగించే జీవితాల‌కు నేడు కొదువ‌లేకుండా పోయింది. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ దేశ‌వ్యాప్తంగా అండ‌ర్ ట్రైల్ ఖైదీలు ఎంత‌మంది ఉన్నారు.. అందులో క‌నీసం బెయిల్ ల‌భించ‌క ఎంత‌మంది మ‌గ్గిపోతున్నారు.. ఏం త‌ప్పు చేయ‌కుండా విడుద‌లైన వారెంత‌మంది అని వివిధ ఆంశాల‌పై యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ స‌భ్యులు మ‌ణిదీప్ జాతీయ స్థాయిలో స‌మాచారం హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేయ‌గా ప‌లు ఊహించ‌లేని విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి తెలిపారు.

దేశంలో మూడు లక్షలకు పైగా విచారణ దశలో ఉన్న ఖైదీలు ఉన్నారని, మొత్తం మీద ఇప్పటి వరకు 61,359మంది నిర్దోషులుగా కోర్టు నుండి బయటకు వచ్చారని యూత్ ఫర్ అంటీ కరప్షన్ సంస్థ సభ్యుడు నల్లపు. మణిదీప్ (24) ఫైల్ చేసిన సమాచార దరఖాస్తుకుగాను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో సంబంధింత‌ డేటా 2019 డిసెంబర్ వరకు ఉన్న సమాచారాన్ని ఇచ్చింది. ఇందుకు ప్రిసనర్స్ స్టాటిస్టిక్స్ ను ప్రామాణికంగా తీసుకోవచ్చని తెలిపింది. దేశంలో 3,30,487 మంది విచారణ దశలో ఉన్న ఖైదీలు ఉన్నార‌ని.. తప్పుడు కేసులలో నిరుపేదలు జైళ్లలో ఏడాదికి పైగా ఉన్న కేసులు ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు స‌మాచారంతో తెలిసిపోయింద‌ని వారు అన్నారు.

విచారణ దశలో ఉన్న నిరుపేద ఖైదీలు 3 నెలల నుండి దాదాపు 2 సంవత్సారాల వరకు కూడా బెయిల్ తెచ్చుకోవడం వంటి లీగల్ ప్రొసీజర్ తెలియక, కనీసం ష్యూరిటీ పెట్టుకునే ఆర్థిక స్టోమత లేక, పేదరికంతో అలాగే జైళ్లలో మగ్గిపోయి చివరకు నిర్దోషులుగా బయటకు రావడం జరుగుతున్నదని, ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన ఇలాంటి విషయాలను న్యాయస్థానాలే సుమోటోగా తీసుకోవాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలిపింది. దీనిపై ఇప్పటికే ఈ విధంగా జరిగిన జరిగిన విషయాలపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసే విధంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ లీగల్ టీమ్ అడుగులు వేస్తుందని సంస్థ తెలిపింది.

సత్యం న్యూస్, హైదరాబాద్

Related posts

పార్టీ ఫిరాయింపుపై కరణం బలరామ్ కు తీరని అవమానం

Satyam NEWS

ఎమ్మెల్యేని ఓడించి దేవరకద్రను కాపాడుకుందాం

Satyam NEWS

బంగారంలాంటి అవకాశం కోల్పోయిన జగన్

Satyam NEWS

Leave a Comment