37.2 C
Hyderabad
April 19, 2024 12: 57 PM
Slider కడప

ఐదుగురు మహిళల ప్రాణాలు కాపాడిన పోరుమామిళ్ల పోలీసులు

#Kadapa Floods

కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో  రేపల్లె వాగు ఉధృతికి కాజ్ వేపై నీటి ప్రవాహంలో చిక్కుకున్న 5 మంది మహిళలను పోలీసులు కాపాడారు.

కొట్టాల పల్లి గ్రామం నుండి పనిపై గానుగపెంటకు వారు వచ్చారు. మొదట్లో ప్రవాహం తక్కువ ఉండటంతో సులువుగా గ్రామం నుండి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో కొద్దీ దూరం వచ్చి ప్రవాహ ఉదృతి కి నిలిచిపోయి రక్షించాలంటూ కేకలు వేశారు. పోరుమామిళ్ల నుండి చెరువులు, వాగులు, నదుల  ప్రమాదకర స్థితిని తెలుసుకునే విధుల్లో తిరుగుతున్న పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, కానిస్టేబుల్ ఓబులేసు మహిళల ఆర్తనాదాలు విని కాపాడేందుకు రంగంలోకి దిగారు.

 హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు సమయస్ఫూర్తితో కాజ్ వే వంతెన మధ్యకు వెళ్లి బాధిత మహిళలను ఒడ్డుకు చేర్చారు. తమ ప్రాణాలను కాపాడిన పోరుమామిళ్ల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు లకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు శాఖకు రుణపడి ఉంటామన్నారు. ఐదుగురి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు.

Related posts

మనీలాండరింగ్ కేసులో ఫరూక్ అబ్దుల్లాపై చార్జిషీట్ దాఖలు

Satyam NEWS

సమాచార హక్కు రక్షణ చట్టం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

ఎన్ని సార్లు గుండె నొప్పి వస్తుది కోడెలా?

Satyam NEWS

Leave a Comment