27.7 C
Hyderabad
April 25, 2024 09: 45 AM
Slider ప్రపంచం

ప్రపంచ దేశాలలో క్షణ క్షణానికి పెరుగుతున్న పాజిటీవ్ కేసులు

corona

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్షణ క్షణానికి పెరుగుతున్నాయి. వివిధ దేశాలలో 48 గంటల వ్యవధిలో 4 నుంచి 5 లక్షలకు పాజిటివ్ కేసులు చేరాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5,32,224 కేసులు నమోదు అయి ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య ఇప్పటి వరకు 24వేలు దాటింది.

కరోనా సోకిన వారిలో 1,24,326 మంది రికవరీ అయ్యారు. ఇంకా 3.83 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్నది. కేసుల సంఖ్యలో చైనా, ఇటలీని అమెరికా అధిగమించింది. 85,594 కరోనా కేసులతో అగ్రస్థానంలో అమెరికా ఉంది.

81,340 కేసులతో 2వ స్థానంలో చైనా, 80,589 కేసులతో 3వ స్థానంలో ఇటలీ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ (57,786), జెర్మనీ (43,938), ఇరాన్ (29,406), ఫ్రాన్స్ (29,155) ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో ఇటలీ (8,215), రెండో స్థానంలో స్పెయిన్ (4,365) ఉన్నాయి.

ఆ తర్వాతి స్థానాల్లో చైనా, ఇరాన్, ఫ్రాన్స్, అమెరికా ఉన్నాయి. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 727కు చేరుకున్నాయి.

Related posts

బాలకృష్ణ జోలికొస్తే తరిమి తరిమికొడతాం

Satyam NEWS

జోరు వర్షంలో… సర్పంచ్ ల నిరసన

Bhavani

Analysis: దక్షిణాది కైవసానికి ఆట మొదలెట్టిన మోడీ

Satyam NEWS

Leave a Comment