24.7 C
Hyderabad
March 29, 2024 05: 26 AM
Slider పశ్చిమగోదావరి

అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం పోస్టు కార్డు ఉద్యమం

#postcard

మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు పోస్టు కార్డులు రాసేందుకు సన్నద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు విజయవర్ధన్ బాబు బట్టు పత్రికల వారికి వివరించారు.

గత ఇరవై ఏళ్లుగా కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులుగా వైద్య ఆరోగ్యశాఖ లో డి.ఎస్.సి ద్వారా రుల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాటిస్తూ అన్ని అర్హతలతో సాంక్షండ్ పోస్టుల్లో పనిచేస్తున్న తమను న్యాయబద్ధంగా రెగ్యులర్ చేయాలని కోరుతున్నామన్నారు.

రెగ్యులర్ కు అన్ని విధాల అర్హులైన తమను రెగ్యులర్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గత 141రోజులుగా వివిధ రూపాల్లో 13 జిల్లాల్లో ఉద్యమాలు చేస్తున్న సంగతిని ఆయన గుర్తు చేస్తూ ఇప్పటికైనా తమ రెగ్యులర్ విషయంలో ప్రభుత్వం స్పందించాలని అభ్యర్థించారు.

ఇదే విషయాన్ని మరోమారు ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ముఖ్యమంత్రికే నేరుగా 16వ తేదీ నుంచి పోస్టు కార్డులు రాసేందుకు సన్నద్ధమయ్యామని వారు  వివరించారు.

మ్యానిఫెస్టోలో మాట ఇచ్చిన హామీ మేరకు అర్హులైన తమను రెగ్యులర్ చేసే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించి రెగ్యులర్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాసే కార్యక్రమం ప్రారంభించామని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దారం సభాపతి చంద్రశేఖర్ బట్టు గురునాథం జి గోవిందరాజు పి జగదీష్ సింగరాజు మారడానికి కిరణ్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెండి తెరపై కనిపించనున్న టీవీ 5 మూర్తి

Satyam NEWS

రూ. 76 లక్షలు హవాలా నగదు స్వాధీనం

Bhavani

మహా పాదయాత్రకు తాత్కాలిక విరామం

Satyam NEWS

Leave a Comment