27.7 C
Hyderabad
April 20, 2024 01: 24 AM
Slider సంపాదకీయం

టీఆర్ఎస్ కు ప్రమాదఘంటికలు మోగించిన పోస్టల్ బ్యాలెట్

cm kcr

ఇంత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్ కు, తెలంగాణ రాష్ట్ర సమితికి రక్షణ కవచంలా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు వేరే విధంగా ఆలోచిస్తున్నారా? జీహెచ్ఎంసి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలైన సరళి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే కనిపిస్తున్నది.

కేవలం పోస్టల్ బ్యాలెట్ ఆధారంగానే అదీ కూడా తొలి రౌండ్ కూడా పూర్తి కాకుండానే జయాపజయాలు బేరీజు వేయడం కరెక్టు కాదు కానీ పోస్టల్ బ్యాలెట్ తీరు తెన్నులు చూస్తే మాత్రం టీఆర్ఎస్ కు ఉద్యోగస్థులలో పలుకుబడి గణనీయంగా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నది.

ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ కు గత ఎన్నికలలో మాదిరిగా 99 స్థానాలు గానీ అంతకన్నా ఎక్కువగానీ వస్తే రావచ్చు. లేదా 65 స్థానాలతో ఆగిపోవచ్చు. తుది ఫలితం సంగతి అలా ఉంచితే పోస్టల్ బ్యాలెట్ తీరు మాత్రం అధికార పార్టీకి ఆందోళన కలిగించే అంశమే.

పోస్టల్ బ్యాలెట్ ను పోలింగ్ సిబ్బందికి ఇస్తారు. బందోబస్తులో ఉన్న పోలీసులకు కూడా ఆ సౌకర్యం ఉంటుంది. గతంలో పోలింగ్ సిబ్బందిగా టీచర్లను నియమించేవారు కాగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వారిని ఎన్నికల విధుల్లో నియమించలేదు.

పోలింగ్ కేంద్రాలలో ఈ సారి మునిసిపల్ సిబ్బందితో బాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులు పని చేశారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో బాటు ఈ సారి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వృద్ధులకు, అంగవికలురకు, కరోనా వ్యాధిగ్రస్తులకు కూడా కల్పించారు.

ఈ క్యాటగిరీలో చాలా కొద్ది మంది ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వాడుకున్నారు. అదే వేరే విషయం. పోస్టల్ బ్యాలెట్ వరకే లెక్కవేస్తే దాదాపు 65 స్థానాలలో బిజెపి ఆధిక్యత సాధించింది. ఇది చిన్న విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రదర్శించడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం కరవు భత్యం నుంచి అన్ని రకాల సౌకర్యాలను ఇవ్వకపోవడం, తాత్కాలిక భృతి వాయిదాలు లాంటివి పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకతకు ఇవన్నీ కారణాలు కావచ్చు.

కేవలం రెండు మూడు డిపార్టుమెంట్ల ఉద్యోగుల వైఖరిని బట్టి మొత్తం పరిస్థితిని ఎలా అంచనా వేస్తారు? అన్న ప్రశ్న సంధించేవారికి సమాధానం చెప్పలేం కానీ ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించిందనేది మాత్రం వాస్తవం. దీన్ని సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రమాదం తప్పదు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

నందిగామ పట్టణంలో టీడీపీలోకి పెరిగిన వలసలు

Satyam NEWS

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

Bhavani

సనాతనం

Satyam NEWS

Leave a Comment