28.7 C
Hyderabad
April 20, 2024 04: 19 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూనివర్సిటీ లో పొట్టి శ్రీరాములు వర్ధంతి

#VS University

నెల్లూరు జిల్లా కాకుటూరు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీ రాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు వారు చేసిన కృషిని తెలియజేస్తూ, వారి వర్ధంతికి నివాళులర్పించడం జరిగింది.

అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పొందటం మనందరి గర్వకారణంగా భావిస్తూ విద్యార్థిని విద్యార్థులకు ఆయన చేసిన సేవలను వివరించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అకుంఠిత దీక్షను మరియు పుట్టిన గడ్డ పై ఆయన కున్న దేశ భక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య విజయ ఆనంద కుమార్ బాబు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా.

ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే. సునీత, డా. విద్యా ప్రభాకర్, అధ్యాపకులు డా. ఆర్ ప్రభాకర్, డా. హనుమా రెడ్డి, అధ్యపకేతర సిబ్బంది డా. జి. సుజయ, రామకృష్ణ, మరియు విద్యార్థినీ విద్యార్థులు వారి చిత్రపటానికి ఘన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

Related posts

Tragedy TDP: తొక్కిసలాటలో ముగ్గురు మృతి

Satyam NEWS

క్రైస్తవ పాలకుల మెప్పు కోసం మరీ ఇంత బరితెగింపా?

Satyam NEWS

వనపర్తి నియోజకవర్గంలో అవినీతి పాలనను అంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment