37.2 C
Hyderabad
April 19, 2024 12: 34 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌….

#Tirumala

తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. గురుపౌర్ణ‌మి సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

పికా సిండ్రోమ్:జాన్సన్ అండ్ జాన్సన్ లెసా హైలెస్సా

Satyam NEWS

శ్రమించి పనిచేసే టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు

Satyam NEWS

టీడీపీ నుంచి వచ్చారు టీడీపీ లో చేరారు….

Satyam NEWS

Leave a Comment