39.2 C
Hyderabad
March 28, 2024 16: 58 PM
Slider ప్రత్యేకం

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల మోత

#HyderabadElectricity

డిస్కమ్‌లు ఐదేళ్ల విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలు కమిషన్‌ ముందుంచాయని, దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను కమిషన్‌ పరిగణనలోకి తీసుకుందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్‌ టి.శ్రీరంగారావు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఈఆర్సీ ఛైర్మన్‌ వివరాలు వెల్లడించారు. 2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్‌ రూ.16వేల కోట్లు. కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్‌ ఆమోదించింది. రెవెన్యూ అవసరాలు రూ.53వేల కోట్లుగా ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదన. ఏఆర్‌ఆర్‌ ప్రతిపాదనలకు కమిషన్‌ రూ.48,708 కోట్లు ఆమోదించింది. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెంపు. పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి’’ అని ఈఆర్సీ ఛైర్మన్‌ తెలిపారు. గతంలో కంటే 38.38శాతం అధికంగా ప్రతిపాదన వచ్చిందన్న శ్రీరంగారావు… వ్యవసాయానికి విద్యుత్‌ టారిఫ్‌ పెంచలేదని స్పష్టం చేశారు. ఈవీ ఛార్జింగ్‌కు టారిఫ్‌ ప్రతిపాదనలు ఆమోదించలేదని, డిస్కమ్‌లు నవంబరు 30లోపు ప్రతిపాదనలు కమిషన్‌ ముందుంచాలని ఆదేశించినట్టు వెల్లడించారు. జీడిమెట్ల స్మార్ట్‌గ్రిడ్‌ పూర్తి స్థాయిలో విస్తరించాలని సూచించామని తెలిపారు.

Related posts

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

Sub Editor

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం మహా సంకల్ప దీక్ష

Satyam NEWS

డిసెంబర్‌ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు

Murali Krishna

Leave a Comment