28.7 C
Hyderabad
April 20, 2024 10: 28 AM
Slider నల్గొండ

గ్రామ కంఠం ఆక్రమించిన పెత్తందారుపై చర్యలేవి?

#PrajaPorataSamithi

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం కట్టంగూర్ మండలం అయిటిపాములలోని గ్రామకంఠం భూమిని అక్రమంగా ఆక్రమించిన పెత్తందారుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ఆరోపించారు.

సర్వే నెంబర్ 1101 లో అర్ధ ఎకరం గ్రామకంఠం భూమిని అక్రమంగా ఆక్రమించి, అందులో వాటర్ ప్లాంట్ ను ఆయన ఏర్పాటు చేశాడని వెంకట్ స్వామి తెలిపారు. ఈరోజు అయిటిపాముల గ్రామంలో పెత్తందార్ చే అన్యాయంగా దురాక్రమణకు గురైన ప్రభుత్వభూమిని పరిశీలించి, కౌంటర్ కేసులకు గురైన దళితులను పరామర్శించిన వెంకట్ స్వామి మాట్లాడారు.

గ్రామ పెత్తందారు దురాక్రమణలో గ్రామకంఠం భూమి ఉన్నదని ఇటీవలే రెవిన్యూ నిర్ధించిందని, ఈ దురాక్రమణను ప్రశ్నించిన దళితులను గ్రామ పెత్తందారు కులం పేరుతో దూషించాడని తెలిపారు. ఈ గ్రామ పెత్తందారుపై ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కేసు పెట్టడానికి సంశయించిన స్థానిక ఎస్.ఐ. దళితులపైనే కౌంటర్ కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు.

వెంటనే పెత్తందార్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. నల్లగొండలోని డి.ఎస్.పి. ఆఫీస్ కు వెళ్ళి, డి.ఎస్.పి వెంకటేశ్వరరెడ్డి కి పిటిషన్ ఇచ్చారు. వీలయినంత త్వరలో విచారిస్తామని డి.ఎస్.పి. చెప్పారని వారన్నారు.  

ప్రత్యక్ష పరిశీలన చేసి డి.ఎస్.పి. కి పిటిషన్ ఇచ్చిన వారిలో పి.ఆర్.పి.ఎస్. మండల నాయకులు నీల స్వామి, చినపాక రమేశ్, కోనేటి వెంకన్న, కన్నెబోయిన వెంకన్న, ఇంద్రకంటి సైదులు, అయిటిపాముల గ్రామ మాజీ సర్పంచ్ నూనె పద్మయ్య, కొవ్వూరి రంజిత్, కొండ్ర నరసింహ తదితరులు ఉన్నారు.

Related posts

కేటీఆర్ ఐటీ హబ్:వరంగల్‌లో మరో ఐటీ కంపెనీ

Satyam NEWS

శ్రీనివాస్ కుటుంబానికి సీపీ మహేష్ భగవత్ సహాయం

Satyam NEWS

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి పుట్టిన రోజున మెగా బ్లడ్ క్యాంప్

Satyam NEWS

Leave a Comment