వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశం మేరకు ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే ప్రజావాణిలో బాగంగా వనపర్తి జిల్లా పోలీస్ అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతోందని తెలిపారు. వనపర్తి జిల్లాలోని మొత్తం 06 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో భూ ఫిర్యాదులు 02, పరస్పర గొడవలు 03, భార్యాభర్తల గొడవలు 01 ఉన్నాయి.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్