31.2 C
Hyderabad
April 19, 2024 04: 40 AM
Slider ఆదిలాబాద్

ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల వెల్లువ

prajavani

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ప్రజలనుండి దరఖాస్తులను  స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.

తానూర్ మండలం హాంగీర్ల కు చెందిన శ్యామలాబాయి తనకు దివ్యాంగుల  పింఛన్ ఇప్పించాలని,  లక్ష్మణాచాంద మండలం పొట్టపల్లి  గ్రామానికి చెందిన దేవన్న వ్యవసాయ భూమికి పట్టాదార్ పాస్ బుక్ రాలేదని,   కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన ఇప్ప గంగవ్వ రైతు బందు ఇప్పించాలని వినతి పత్రం సమర్పించారు.  

కడెం మండలం ఎల్లాపూర్ కు చెందిన బుర్లకుంట రాజలింగు తన వ్యవసాయ భూమి ఆక్రమణ చేసిన వారిపై చర్యలు తీసుకోని తనకు పట్టా దార్ పాస్ బుక్ ఇప్పించాలని, ముధోల్ కు చెందిన కైసరి బేగం వారసత్వ వ్యవసాయని తనపేరున పట్టా పాస్ బుక్ ఇప్పించాలని అర్జీ పెట్టుకున్నారు.

సారంగాపూర్ మండలం ఆలూర్ కు చెందిన దేశెట్టి రామవ్వ రైతుబంధు రాలేదని  విన్నవించగా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, ఆర్డీవో ప్రసూనాంబ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కరీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన హుజూర్ నగర్ కనకదుర్గ ఆలయం

Satyam NEWS

విశాఖ లో మెట్రో రైల్ ప్రాజెక్టు ఆఫీస్ ప్రారంభం

Satyam NEWS

స్నాక్స్ టైమ్: పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం

Satyam NEWS

Leave a Comment