పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయడానికి వచ్చే బాదితులకు ఆప్యాయంగా పలకరించి ముందుగా తాగునీరు అందించాలని అదనపు ఎస్పీ ఎస్.శ్రీనివాస్ రావు పోలీసులకు చెప్పారు. ఎస్పీ సి.శశిధర్ రాజు ఆదేశాల మేరకు ఆయన నేడు ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు.
వారి సమస్యలను తెలుసుకొని వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా బాధితుల సమస్యలను తెలియజేసి వెంటనే చర్యలు తీసుకొని పూర్తి దర్యాప్తు చేసిన నివేదిక అందించాలని ఆదేశించారు. రాత్రి సమయంలో గస్తీతో పటు పెట్రోలింగ్, వాహనాలను తనిఖీలు చేస్తూ చురుకుగా పని చేయాలన్నారు. పోలీసులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ఆయన అన్నారు.
కాలనీల్లో అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరించినట్లయితే సంబదిత పోలీసు స్టేషన్ ఎస్.ఐ. లేదా సి.ఐ.లకు ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8333986939కు సమాచారం తెలియజేయాలని కోరారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలకు సేవ చేయడంలో నిర్మల్ పోలీసులు ముందుంటారని భరోసా ఇచ్చారు.