28.7 C
Hyderabad
April 20, 2024 10: 20 AM
Slider ప్రకాశం

కరోనా మాస్క్ లపై ప్రకాశం జిల్లా ఎస్ పి అవగాహనాకార్యక్రమం

#PrakasamDistPolice

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్  ఆధ్వర్యంలో జిల్లా అంతట కరోనా వైరస్ సెకండ్ వేవ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ప్రజలను జిల్లా పోలీసులు చైతన్య పరుస్తున్నారు.

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి ఒంగోలులోని, మంగమూరు జంక్షన్ వద్ద ఎస్పీ కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు.

అదే విధంగా మాస్కులు ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి పోలీసులు జరిమానా విధించారు. మాస్కులు ధరించి వున్న వాహనదారులకు ఎస్పీ పూలు అందచేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో మాస్కులు ధరించని వారిపై  ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.

ఆరోగ్యాన్ని దృష్టిలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ప్రైవేట్ సంస్థలు, కళాశాలలు, పాఠశాల యాజమాన్యాలు కరోనా వైరస్ నివారణలో భాగంగా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీస్ శాఖ తరుపున కూడా అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ తెలియజేశారు.

ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మాస్కు ధరించని వారిపై 2,760 కేసులు నమోదు చేసి 2,60,230/- రూపాయలు చలానా విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు DSP K.V.V.N.V.ప్రసాద్, ట్రాఫిక్ DSP యన్.సురేంద్ర, SB -1 ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ, కమాండ్ కంట్రోల్ ఇన్ స్పెక్టర్ ఆర్.రాంబాబు, ఒంగోలు తాలూకా సిఐ రామ కృష్ణ రెడ్డి, ఒంగోలు వన్ టౌన్ సిఐ Ch.సీతారామయ్య, ఒంగోలు టౌన్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నిర్మలమ్మ బడ్జెట్ కు జగనన్న ప్రభుత్వం కితాబు

Bhavani

“మన బస్తీ- మన బడి” కార్యక్రమం పనుల్లో నాణ్యత తగ్గకుండా చూడండి

Satyam NEWS

కోవిడ్ 19 ఏ.వై. 4.2పై ఆందోళన వద్దన్న ఇన్సాకాగ్‌

Sub Editor

Leave a Comment